Rice: మన భారత దేశంలో వరి ప్రధాన ఆహార పంటగా మారిపోయింది. మనదేశంలో ఎక్కువగా బియ్యంతో చేసిన అన్నం పైనే ఆధారపడుతుంటాము కనుక ఎక్కువగా ఇదే పంటను పండిస్తూ ఉంటారు. అయితే చాలామంది మూడు పూటలా అన్నం తింటూ ఉంటారు లేదంటే ఇడ్లీ దోస వంటి టిఫిన్స్ కి కూడా ఈ బియ్యం ఉపయోగిస్తాము కనుక ఒకేసారి ఎక్కువ మొత్తంలో కొనుగోలు చేస్తూ ఉంటారు. ఇలా ఏడాదికి సరిపడా బియ్యం ఒకేసారి కొనుగోలు చేయడం వల్ల కొన్ని సార్లు ఆ బియ్యం పురుగు పట్టే అవకాశాలు కూడా ఉంటాయి.
ఇలా బియ్యం ఎక్కువ కొనుగోలు చేసి నిల్వ చేయడం వల్ల పురుగులు పడితే వాటిని తినడానికి ఎంతో ఇబ్బందిగా ఉంటుంది అలాగే శుభ్రం చేయాలన్న ఎంతో కష్టంగా ఉంటుంది కనుక బియ్యంలో పురుగులు పట్టకుండా కొన్ని టిప్స్ పాటిస్తే ఈ సమస్య అసలు ఉండదని తెలుస్తోంది. మరి బియ్యంలో పురుగు పట్టకుండా ఉండాలి అంటే ఎలాంటి టిప్స్ పాటించాలి ఏంటి అనే విషయానికి వస్తే..
బియ్యం నిల్వ చేసేటప్పుడు గాలి తేమ లేని ప్రదేశాలలో నిల్వచేయటం ఎంతో మంచిది. అదేవిధంగా బియ్యం నిల్వ చేసే ముందు మనం వాటిని ఎండలో బాగా ఆరనిచ్చిన తర్వాత నిల్వ చేసుకోవాలి. ఇకపోతే బియ్యం ప్యాకెట్లలో వేపాకును కనుక వేసి మనం నిల్వ చేయటం వల్ల పురుగు సమస్య అసలు ఉండదు. వేపాకులో ఎన్నో యాంటీబయోటిక్స్ ఉంటాయి. అందుకే వేపాకును బియ్యం బస్తాలలో వేయటం వల్ల ఈ సమస్య నుంచి బయటపడవచ్చు.ఇక బిర్యానీ ఆకులు కూడా పురుగులను తరిమి కొట్టడానికి ఎంతగానో దోహదం చేస్తాయి బిర్యాని ఆకులు వంటకు రుచిని మాత్రమే కాదు బియ్యంలో పురుగులు పడకుండా కూడా సహాయపడుతుంది. ఇక మసాలా దినుసులు అయినటువంటి మిరియాలు లవంగాల వాసన కూడా పురుగులకు ఏమాత్రం పడదు కనుక ఈ లవంగాలు లేదా మిరియాలను ఒక బియ్యం బస్తాలో పది వరకు వేసి నిల్వ చేసుకోవచ్చు తద్వారా పురుగు సమస్య ఉండదు. ఇలా ఈ టిప్స్ పాటిస్తే ఈ సమస్య నుంచి మనం ఉపశమనం పొందవచ్చు.