Eating Apple:ప్రతిరోజు ఒక యాపిల్ పండు తినడం వల్ల ఏ విధమైనటువంటి అనారోగ్య సమస్యలు మన దరికి చేరవు అని డాక్టర్లు చెబుతుంటారు.ఒక ఆపిల్ పండు మనల్ని డాక్టర్లకు దూరం చేస్తుందని చెప్పాలి. ఇలా యాపిల్ పండులో ఎన్నో రకాల పోషక పదార్థాలు ఉండటం వల్ల మన శరీరానికి అవసరమైనటువంటి పోషక విలువలను యాపిల్ తినడం ద్వారా పొందవచ్చు.అయితే యాపిల్ తిన్న తర్వాత చాలామంది ఇతర ఆహార పదార్థాలను కూడా తింటుంటారు.ఇలా యాపిల్ తిన్న తర్వాత కొన్ని పదార్థాలను తినడం వల్ల పూర్తిగా అనారోగ్య సమస్యలు బారిన పడాల్సి ఉంటుంది. మరి యాపిల్ తింటున్న తర్వాత ఎలాంటి ఆహార పదార్థాలను తినకూడదు అనే విషయానికి వస్తే…
యాపిల్ తిన్న తర్వాత ముల్లంగిని తినకూడదు యాపిల్ మన శరీరానికి చాలా చలువ కలిగిస్తుంది అలాగే ముల్లంగి కూడా చలువను కలుగజేస్తుంది అందుకే ఆపిల్ తిన్న తర్వాత ముల్లంగి తినడం వల్ల ఇది జలుబు చేయడానికి కఫం ఏర్పడటానికి కారణం అవుతుంది. అందుకే ఆపిల్ తిన్న తర్వాత ముల్లంగి తినకూడదు. అదేవిధంగా చాలామంది యాపిల్ తిన్న వెంటనే నీటిని తాగుతుంటారు. ఇలా నీటిని తాగడం వల్ల కూడా జలుబు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
Eating Apple
చాలామంది యాపిల్ పండును తిన్న తర్వాత పెరుగు పాలు తినడానికి ఇష్టపడతారు. అయితే ఇలా పెరుగు పాలు తాగడం కూడా ఆరోగ్యానికి మంచిది కాదని ఎక్కువగా కఫం ఏర్పడుతుందని నిపుణులు చెబుతున్నారు. అందుకే యాపిల్ తిన్న తర్వాత కొంత సమయం పాటు ఏ ఇతర ఆహార పదార్థాలను తినకుండా ఉండటం వల్ల అందులో ఉన్నటువంటి పోషక విలువలు అన్ని కూడా మన శరీరానికి సక్రమంగా అందుతాయి. ముఖ్యంగా ఈ ఆహార పదార్థాలను అస్సలు తినకూడదని నిపుణులు చెబుతున్నారు.