Amla Before Meals: ప్రస్తుత కాలంలో మారుతున్న వాతావరణ పరిస్థితులు అలాగే మారిన ఆహారపు అలవాట్లు కారణంగా ఎంతో మంది ఎన్నో రకాల జబ్బులతో సతమతమవుతున్నారు. ముఖ్యంగా ప్రస్తుతం మనదేశంలో డయాబెటిస్ అనే మహమ్మారి చాప కింద నీరు లాగా వ్యాప్తి చెందుతుంది. ప్రతి పదిమందిలో ఏడు మంది డయాబెటిస్ సమస్యతో బాధపడుతున్నారు. ఇలా డయాబెటిస్ సమస్యతో బాధపడేవారు చక్కర స్థాయిలను నిలకడగా ఉంచుకోవడం కోసం ఎన్నో రకాల సహజ పద్ధతులను ఉపయోగిస్తూ ఉంటారు.
ఈ విధంగా సహజ పద్ధతులలో చక్కర స్థాయిలు నియంత్రణలో ఉంచడంలో ఉసిరికాయ చాలా వరకు దోహదపడుతుంది.విటమిన్ సీ, యాంటీ ఆక్సిడెంట్లతో నిండిన ఉసిరికాయలో గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువగా ఉంటుంది. భోజనానికి ముందు పచ్చి ఉసిరికాయను తినడం అనే ఒక చిన్న అలవాటు వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు అకస్మాత్తుగా పెరగకుండా నియంత్రించవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.డయాబెటిస్ ఉన్నవారిలో భోజనం చేసిన వెంటనే రక్తంలో చక్కెర స్థాయిలు వేగంగా పెరిగే ప్రమాదం ఉంది. ఇలా చక్కెర స్థాయిలు పెరగడం వల్ల క్లోమగ్రంధి పై తీవ్రమైన ఒత్తిడి ఏర్పడుతుంది.
ఈ నేపథ్యంలోనే భోజనానికి ముందు ఉసిరికాయను తీసుకోవడం వల్ల శరీరంలో కార్బోహైడ్రేట్ల శోషణ ప్రక్రియ మందగిస్తుంది. అందుకే భోజనానికి ముందు ఉసిరి తీసుకోవడం వల్ల ఆహారం ద్వారా వచ్చే గ్లూకోజ్ ప్రవాహాన్ని ఎదుర్కొని శరీర జీవక్రియను సిద్ధం చేస్తుంది. ఉసిరిలో ఉండే పాలీఫెనాల్స్ గ్లూకోజ్ మెటబాలిజంను మెరుగుపరుస్తాయి. మధుమేహంతో బాధపడేవారు రోజుల్లో వివిధ రకాలుగా ఉసిరిని తినటం మంచిది. అలాగే చక్కెరలు లేకుండా ఉసిరి రసాన్ని కూడా తాగటం వల్ల చక్కెర స్థాయిలను నియంత్రించవచ్చు. ఉసిరి ఆరోగ్యానికి ఎంతో మంచి చేసినప్పటికీ చాలా పరిమితంగానే తీసుకోవాలి ఇంకా డయాబెటిస్ కోసం మందులు వాడుతున్న వారు డాక్టర్ సలహా లేకుండా ఉసిరికాయలు వాడకూడదు. డాక్టర్ ను సంప్రదించి వారి సలహాలు సూచనలు మేరకు ఉసిరికాయను ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు.
Srinidhi Shetty: కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టికి తెలుగులో ఇప్పటి వరకూ సాలీడ్ దక్కలేదు. కన్నడలో ఆమె నటించిన కేజీఎఫ్…
Tollywood: నేచురల్ స్టార్ నాని నటించబోతున్న లేటెస్ట్ మూవీ బ్లడీ రోమియో. సుజీత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రస్తుతం,…
Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…
Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…
Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…
Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…
This website uses cookies.