Friday Pooja: శుక్రవారం ఈ దిశలో దీపం పెడితే చాలు అష్టైశ్వర్యాలు మీ సొంత..

Friday Pooja: మన హిందూ సంప్రదాయాల ప్రకారం శుక్రవారానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. శుక్రవారం మహాలక్ష్మికి పూజ చేయడం వల్ల అష్టైశ్వర్యాలు కలుగుతాయని ప్రతి ఒక్కరు విశ్వసిస్తూ ఉంటారు. అందుకే అమ్మవారి అనుగ్రహం కోసం శుక్రవారం పెద్ద ఎత్తున అమ్మవారికి పూజ చేస్తూ ఉంటారు. అయితే మహాలక్ష్మి అనుగ్రహం కలిగి అష్టైశ్వర్యాలు కలగాలి అంటే శుక్రవారం సాయంత్రం ఈ చిన్న పనులు చేయటం వల్ల అమ్మవారి అనుగ్రహం కలిగి సకల సంపదలకు అధిపతి అవుతారు. మరి శుక్రవారం లక్ష్మీదేవి అనుగ్రహం కోసం చేయాల్సిన పనులు ఏంటనే విషయానికి వస్తే..

శుక్రవారం సాయంత్ర సమయంలో ఇంట్లో చీకటిగా ఉండకూడదు ఇల్లు మొత్తం వెలుగులతో నిండి ఉండటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహానికి గురి అవుతాము. లక్ష్మీదేవి మన ఇంట్లో స్థిర నివాసం ఉండాలి అంటే శుక్రవారం సాయంత్రం ఇంటి ప్రధాన ద్వారం ఇరువైపులా దీపాలను వెలిగించడం మంచిది. ఇలా రెండు వైపులా వెలిగించలేని వారు ఇంటి గుమ్మం కుడి వైపు వెలిగించడం మంచిది. ఈ దీపం దుష్టశక్తులను ఇంట్లోకి రానీయకుండా అడ్డుకుంటుంది.

శుక్రవారం అమ్మవారి చిత్రపటానికి పూజ చేసి నెయ్యితో దీపం వెలిగించాలి అయితే దీపం వెలిగించడానికి తామర వత్తులను ఉపయోగించడం వల్ల అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. ఇలా పూజ చేసిన అనంతరం లక్ష్మీ అష్టోత్తరం చదువుకోవటం మంచిది. ఇక తులసి మొక్కను సాక్షాత్తు లక్ష్మీదేవిగా భావిస్తాము కనుక శుక్రవారం సాయంత్రం తులసి కోట ముందు దీపం వెలిగించాలి. దీపం వెలిగించే సమయంలో దీపం కింద పువ్వులు లేదా అక్షతలు వేసి వెలిగించడం మంచిది.

Friday remedies light lamp at these 5 places for goddess lakshmi know details

Friday Pooja : ఈశాన్య దిశలో దీపం వెలిగించడం..

ఈ మూడు చోట్ల మాత్రమే కాకుండా ఈశాన్య మూలంలో కూడా శుక్రవారం సాయంత్రం దీపం వెలిగించడం మంచిది. ఈశాన్యంలో ఒక చిన్న ప్రమిదలో నూనె వేసి దీపం వెలిగించాలి. ఇలా చేయటం వల్ల వాస్తు దోషాలు తొలగిపోయి అంత శుభము కలుగుతుంది. వ్యాపారాలు చేసే వారికి లాభదాయకంగా ఉంటుంది. ఇక శుక్రవారం సాయంత్రం వంటగదిని శుభ్రం చేసి వంట గదిలో దీపం వెలిగించడం వల్ల అన్నపూర్ణాదేవి ఆశీస్సులు కూడా లభిస్తాయి. అయితే దీపం వెలిగించే సమయంలో కచ్చితంగా నేలపై కాకుండా దీపం కింద ఆధారంగా పువ్వులు లేదా చిన్న ప్లేట్,పువ్వులను పెట్టి దీపం వెలిగించాలి. దీపం వెలిగించేటప్పుడు దీపపు వత్తి తూర్పు ఉత్తర దిశ వైపు ఉండేలా చూసుకోవడ మంచిది.

Sravani

Recent Posts

Eating An Apple: పడుకునే ముందు యాపిల్ తినడం మంచిదేనా…ఇది తెలుసుకోవాల్సిందే!

Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…

1 day ago

Tirumala Hundi: రికార్డు స్థాయిలో తిరుమల హుండీ ఆదాయం.. ఆరోజు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు!

Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…

1 day ago

Kidney Health: ఉదయం లేవగానే ఈ తప్పులు చేస్తున్నారా… మీ కిడ్నీ ప్రమాదంలో పడినట్లే?

Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…

5 days ago

Lord Shiva: కోరిన కోరికలు తీరడం లేదా.. శివాలయంలో ఈ పరిహారం చేస్తే చాలు!

Lord Shiva:సాధారణంగా ప్రతి ఒక్కరు తమ జీవితంలో ఎన్నో రకాల కోరికలను కోరుతూ దేవుళ్లను ప్రార్థిస్తూ ఉంటారు.. తమ జీవితంలో…

5 days ago

Climbing Stairs: మెట్లు ఎక్కుతూ అలసిపోతున్నారా? ఫిట్ నెస్ లోపం అనుకుంటే పొరపాటే?

Climbing Stairs: సాధారణంగా మనం అవలీలగా రెండు, మూడు అంతస్తులు మెట్లు ఎక్కగలం కానీ ఒక్కోసారి తక్కువ సంఖ్యలో మెట్లు…

6 days ago

Aja Ekadashi 2026: రేపే అజ ఏకాదశి.. ఈ పరిహారాలు చేస్తే విష్ణు దేవుడి అనుగ్రహం మీపైనే?

Aja Ekadashi 2026: మన హిందూ సాంప్రదాయాల ప్రకారం శ్రావణ మాసానికి ఎంతో మంచి ప్రత్యేకత ఉంది. ఈ శ్రావణ…

6 days ago

This website uses cookies.