Health Tips: కరోనా మహమ్మారి వ్యాపించిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యం పై ఎంతో జాగ్రత్తలు వహిస్తూ ఉన్నారు. అయితే కరోనా తర్వాత చాలామంది ఉదయమే వేడి నీటిని తీసుకోవడం జరుగుతుంది. ఇలా ఉదయమే పరగడుపున వేడి నీటిని తాగటం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి ఇలా తాగడం వల్ల ఏదైనా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయా అనే విషయానికి వస్తే..
ఉదయం లేచిన వెంటనే పరగడుపున కాస్త గోరువెచ్చని నీటిని తాగటం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఇలా గోరువెచ్చని నీటిని తాగడం వల్ల పేగు కదలికలు మంచిగా జరిగి పేగులలో ఏర్పడినటువంటి చెడు పదార్థాలు అన్నింటిని బయటకు పంపించడానికి దోహదం చేస్తుంది. అంతేకాకుండా మనం తీసుకున్నటువంటి ఆహార పదార్థాలు కూడా తేలికగా జీర్ణం అవుతాయి తద్వారా కొవ్వు పేరుకుపోవడం వంటివి జరకదు.
ఇలా మన శరీరంలో కొవ్వు చేరుకోకుండా ఉండటానికి వేడి నీళ్లు దోహదం చేస్తాయి కనుక శరీర బరువు కూడా పెరగరు. శరీర బరువు తగ్గడానికి ఈ వేడి నీళ్లు ఎంతో దోహదం చేస్తాయి. శ్వాస తీసుకోవడం తేలిక అవ్వడమే కాకుండా కండరాలపై కూడా ఒత్తిడి తగ్గుతుంది. వేడి నీళ్లు ఆరోగ్యానికి మంచిది కదా అని అధిక మొత్తంలో కనుక తీసుకుంటే ఇతర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. వేడి నీటిని అధికంగా తీసుకోవడం వల్ల శరీరం నీటి శాతాన్ని కోల్పోయి డీహైడ్రేషన్ అయ్యే అవకాశాలు ఉంటాయి తద్వారా నిద్రలేమి సమస్యలతో బాధపడటం మూత్రపిండాలపై అధిక ప్రభావాన్ని చూపించడం జరుగుతుంది.