Vasthu Tips: సాధారణంగా మనం కొన్ని వాస్తు పరిహారాలను ఎంతగానో విశ్వసిస్తూ ఉంటాము. వాస్తు పరంగా కొన్ని రకాల మొక్కలు మన ఇంటి ఆవరణంలో ఉండటం వల్ల ఎంతో మంచి కలుగుతుందని భావిస్తారు. ఈ క్రమంలోనే మన ఇంటి ఆవరణంలో గనుక మనీ ప్లాంట్ ఉంటే ఎంతో శుభ పరిణామాలు కలుగుతాయని చాలామంది భావిస్తారు. మనీ ప్లాంట్ ఇంటి ఆవరణంలో ఉండటం వల్ల ఏ విధమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉంటాయి.
అయితే మనీ ప్లాంట్ విషయంలో మనం సరైన వాస్తు నియమాలను పాటించాలి వాస్తు గనుక పాటించకపోతే ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. మరి మనీ ప్లాంట్ నాటే విషయంలో ఏ విధమైనటువంటి తప్పులను చేయకూడదనే విషయానికి వస్తే… చాలామంది మనీ ప్లాంట్ నాటేటప్పుడు వారి ఇంటి ఆవరణంలో ఎక్కడ మంచిగా స్థలము ఉంటే అక్కడ నాటుతూ ఉంటారు కానీ ఇలా చేయడం పెద్ద తప్పు మనీ ప్లాంట్ ను పాటిన కూడా ఈశాన్య దిశలో నాటకూడదు. ఇలా ఈశాన్య దిశలో నాటడం వల్ల ఆర్థిక ఇబ్బందులు చుట్టుముడతాయి.
మనీ ప్లాంట్ ను సాక్షాత్తు లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు కనుక ఈ మొక్కను ఆగ్నేయ దిశలో పెట్టడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం మనపై ఉండి ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు ఉండవు ఇక మనీ ప్లాంట్ తీగలు ఎప్పుడు కూడా పైకి ఎగుబాకుతూనే ఉండాలి అలాగే ఈ చెట్టు వాడిపోకుండా చూసుకోవడం ఎంతో మంచిది. ఇలా ఈ చెట్టు ఎంత పచ్చగా ఉంటే మన కుటుంబం కూడా అంతే సంతోషంగా ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉంటుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు.