Pocket Purse: మామూలుగా మనం జేబులో పెట్టుకునే పర్సులో ఎన్నో రకాల వస్తువులను పేపర్లను పెట్టుకుంటూ ఉంటాం. క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు, ఆధార్, విస్టింగ్ కార్డ్స్, డబ్బులు, ఫోటోస్, బిల్స్ ఇలా ఏవేవో పర్స్ లో పెట్టుకుంటూ ఉంటారు. మీకు తెలుసా పర్సులో కొన్ని రకాల వస్తువులను పెట్టుకుంటే ఆర్థిక సమస్యలు తలెత్తుతాయట. అలాంటి వస్తువులు పెట్టుకోవడం వల్ల ఆర్థిక నష్టం రావడం ఖాయం అంటున్నారు పండితులు. కొన్ని వస్తువులు మీ జేబులో లేదా పర్సులో ఉంచకూడదు. అలా ఉంచితే వాస్తు శాస్త్రం ప్రకారం, ఇది పేదరికానికి దారితీస్తుంది. వ్యక్తి ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవలసి ఉంటుంది.
మరి ఎలాంటి వస్తువులు పెట్టకూడదు ఇప్పుడు మనం తెలుసుకుందాం.. వాస్తు ప్రకారం చిరిగిన నోట్లను ప్యాంటు, షర్ట్ పాకెట్లలో పెట్టుకోకూడదు. చిరిగిన నోట్లను జేబులో పెట్టుకుంటే జీవితంలో ఎన్నో కష్టాలు ఎదురవుతాయట. నిత్యం డబ్బులేక బాధపడుతారట. అంతే కాకుండా చిరిగిన పర్సును పొరపాటున కూడా జేబులో పెట్టుకోకూడదు. దీని కారణంగా, మీరు ఆర్థిక ఇబ్బందులతో నిరంతరం పోరాడవలసి ఉంటుంది. వాస్తు శాస్త్రానికి సంబంధించిన ఈ విషయాలను మీరు ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి. కొంతమంది ఫర్స్ చినిగిపోయి బొక్కలు పడినా కూడా అలాగే వినియోగిస్తూ ఉంటారు.
కానీ అలాంటి పర్స్ ని అసలు ఉపయోగించకూడదు అంటున్నారు పండితులు. మీరు మీ జేబులో మందులను ఎప్పుడూ ఉంచుకోకూడదు. దీని కారణంగా మీరు ప్రతికూల శక్తిని ఎదుర్కోవలసి ఉంటుంది. మందుల కోసం ప్రత్యేక సంచిని ఉపయోగించడం మంచిది. అసూయ లేదా కోపం వంటి భావాలను చూపించే చిత్రాలను జేబులో ఉంచుకోకూడదు. అటువంటి చిత్రాలను మీ నుండి దూరంగా ఉంచడం చాలా మంచిది. ఎందుకంటే అవి మీ చుట్టూ ప్రతికూల శక్తిని సృష్టిస్తాయి. మీరు మీ జేబులో విరిగిన నాణేలను ఎప్పుడూ ఉంచుకోకూడదు. ఇది అశుభమైనదిగా కూడా పరిగణిస్తారు. దీంతో జేబులో డబ్బులు ఉండక, డబ్బు లేకపోవడంతో నిత్యం ఇబ్బంది పడక తప్పదు..