Devotional Tips: మహాలయ పౌర్ణమి నుంచి వచ్చే అమావాస్య వరకు ఉండే ఈ 15 రోజులను మహాలయ పక్షాలు అని పిలుస్తూ ఉంటారు. ఈ మహాలయ పక్షాలు పితృదేవతలకు అంకితం చేయబడి ఉంటుంది. ఈ 15 రోజులను పితృపక్షం అని కూడా పిలుస్తారు. ఈ 15 రోజులలో మనం పూర్వీకులకు పిండ ప్రధానం చేయడం వల్ల వారు హింతో సంతోషపడతారు ఇక ఈ 15 రోజులు పితృదేవతలకు అంకితం చేయబడినది కనుక పొరపాటున కూడా ఈ మహాలయ పక్షంలో కొన్ని వస్తువులను కొనకూడదని పండితులు చెబుతున్నారు.
శాస్త్రం ప్రకారం ఈ పితృపక్షంలో మనం పెద్దవారికి పిండ ప్రదానం చేసే వారికి కొత్త బట్టలు పెట్టి పూజ చేసుకోవడం ఎంతో మంచిది అంతేకానీ ఈ 15 రోజులలో పొరపాటున కూడా ఎలాంటి ఆస్తిపాస్తులను కొనుగోలు చేయకూడదని పండితులు చెబుతున్నారు. ఇల్లు భూమి కారు వంటి వాటిని కొనుగోలు చేయకూడదు. పితృపక్షం లో ఈ వస్తువులను కొంటె మాత్రం త్రిదోషం వస్తుందని పండితులు చెబుతున్నారు.
ముఖ్యంగా చెప్పాలంటే ఆవాల నూనె ఈ 15 రోజులపాటు ఈ నూనెను అసలు కొనకూడదు ఆవాలను నూనె శని దేవుడికి ప్రతిరూపంగా భావిస్తారు కనుక ఈ సమయంలో ఈ నూనె కొనుకపోవడం ఎంతో మంచిది. ఇక చీపురు కూడా కొనుగోలు చేయకూడదు. ఈ పితృపక్షంలో చీపురు కొనుగోలు చేయటం వల్ల అమ్మవారి ఆగ్రహానికి గురీ కావాల్సి ఉంటుంది. అయితే ఈ వస్తువులను మీ స్వలాభం కోసం కొనకూడదు కానీ మీ పెద్దల పేరిట వీటిని దానం చేయడానికి కొనుగోలు చేసి ఇతరులకు దానం చేయడం ఎంతో మంచిదని పండితులు చెబుతున్నారు.