Devotional Facts: సాధారణంగా మన ఇంట్లో ఏదైనా ఒక పని తల్లి పెట్టినప్పుడు తరచూ ఆటంకాలు ఏర్పడటం మనం చేసే పనులలో ఇబ్బందులు తలెత్తడం వంటివి జరుగుతూ ఉంటాయి ఇలా ఏ కార్యం తలపెట్టిన విజయవంతంగా పూర్తికాదు ఇలా పూర్తికాని సమయంలో మనం పితృ దోషాలతో బాధపడుతున్నామని సంకేతం మనం ఎలాంటి పనులు ప్రారంభించిన కూడా ఆటంకాలు ఏర్పడుతున్నాయి అంటే పితృదేవతలు మనపై కోపంగా ఉన్నారని అర్థం. పితృ దోష కారణంగా ఇలాంటి ఇబ్బందులు తలెత్తుతూ ఉంటాయి.
ఇకపోతే పితృ దోషం ఉన్న సమయంలో మన ఇంట్లో మనం నాటకుండానే రావివృక్షం మొలుస్తుంది. రావి వృక్షం మన ఇంట్లో మొలిచింది అంటే పితృదేవతలు మనపై చాలా కోపంగా ఉన్నారని వారికి తర్పణం చేసి శాంతి పూజలు చేయాలని సంకేతం. సాధారణంగా రావి వృక్షాన్ని సాక్షాత్తు విష్ణు దేవుడిగా భావిస్తారు. అలాంటి రావి వృక్షం మన ఇంట్లో మనం నాటకుండానే మొలిచింది అంటే తప్పకుండా పితృదేవతల కోపంగా ఉన్నారని పితృదేవతల దోష ఉందని తెలియజేసే సంకేతం అని పండితులు చెబుతున్నారు.
మరి పితృ దోషం ఉన్నట్లయితే వెంటనే వారికి తర్పణం చేయడం మంచిది అలాగే మన ఇంటి ఆవరణంలో మొలచినటువంటి రావి చెట్టును వెంటనే తొలగించకూడదు అలా తొలగించడం వల్ల విష్ణు ఆగ్రహానికి గురి కావాల్సి ఉంటుంది అందుకే ఈ రావి వృక్షానికి 45 రోజులపాటు నీటిని పోసి పూజించాలి. ఇలా 45 రోజుల తర్వాత వృక్షాన్ని వేర్లతో సహా తొలగించి శుభ్రమైనటువంటి ప్రదేశంలో లేదా గుడి ఆవరణంలో నాటి రావటం వల్ల దోషం మొత్తం తొలగిపోతుంది.