Tue. Jan 20th, 2026

    Non veg: ఇటీవల కాలంలో ప్రతి ఒక్కరు కూడా మాంసాహారం తినడానికి చాలా ఇష్టపడుతూ ఉంటారు చికెన్ తో వివిధ రకాల ఆహార పదార్థాలను తయారు చేసుకొని తింటూ ఉంటారు అయితే చాలామంది వారంలో నాలుగైదు రోజులు చికెన్ తింటూ ఉంటారు ఇలా తినడం ఆరోగ్యానికి ఎంతో ప్రమాదం అని నిపుణులు చెబుతున్నారు. వారంలో ఒకటి లేదా రెండుసార్లు అంటే తినొచ్చు కానీ మరి నాలుగైదు సార్లు తినడం అంటే మన శరీరంలో ఎక్కువ కొవ్వు పేరుకు పోవడానికి కారణం అవుతుంది. అలాగే భవిష్యత్తులో గుండెపోటు సమస్యలు రావడానికి దోహదం చేస్తుంది. అందుకే వీలైనంతవరకు వారానికి ఒకసారి చికెన్ తినడం మంచిది.

    ఇక చాలామంది కొన్ని పవిత్రమైన నెలలలో నెల అంతా చికెన్ తినకుండా ఉంటారు ఇలా నెల రోజులు పాటు చికెన్ తినకుండా ఉంటే మంచిదేనా చికెన్ తినకపోతే ఏం జరుగుతుంది అనే సందేహాలు కూడా ప్రతి ఒక్కరిలోనే ఉంటాయి అయితే నెల రోజులపాటు గనుక మనం చికెన్ మానేస్తే క్రమంగా మన శరీర బరువు తగ్గుముఖం పడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇలా చికెన్ తినని సమయంలో మనం ఎక్కువగా కూరగాయలు ఆకుకూరలను తీసుకుంటాం కనుక ఇందులో తక్కువ శాతంలో కెలరీలు ఎక్కువ శాతం లో ఫైబర్ ఉంటుంది కనుక శరీర బరువు తగ్గుతారు.

    నెల మొత్తం కనుక మనం నాన్ వెజ్ మానేసినట్టు అయితే మలబద్ధక సమస్య నుంచి పూర్తిగా బయటపడవచ్చు. జీర్ణక్రియను మెరుగుపరచడమే కాకుండా మలబద్ధకాన్ని పూర్తిగా తగ్గిస్తుంది. తద్వారా జీర్ణక్రియ రేటు కూడా పెరుగుతుంది.నాన్‌వెజ్‌లో సంతృప్త, ట్రాన్స్ ఫ్యాట్ ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరంలో కొలెస్ట్రాల్‌ పెరగడానికి కారణమవుతుంది. ఒక నెల రోజుల పాటు నాన్‌వెజ్‌కు దూరంగా ఉంటే కొలెస్ట్రాల్‌ నియంత్రణలోకి వస్తుంది. వెజ్‌ తీసుకోడం వల్ల రక్తంలో కొలెస్ట్రాల్‌ గణనీయంగా తగ్గుతుంది.కూరగాయలను తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు, సంక్లిష్ట కార్బోహైడ్రేట్లు లభిస్తాయి. ఇవి శరీరంలో శక్తి స్థాయిని పెంచుతాయి. నీరసం తగ్గుతుంది. అందుకే అప్పుడప్పుడు నెలరోజుల పాటు చికెన్ మానేయటం ఆరోగ్యానికి ఎంతో మంచిది.