Mobile Phone: ప్రస్తుత కాలంలో మొబైల్ ఫోన్ ఒక్క నిమిషం పక్కన లేకపోతే ఏమాత్రం దిక్కు తెలియదు. చిన్నపిల్లల నుంచి మొదలుకొని పెద్దవారు వరకు కూడా నిత్యం సెల్ఫోన్లోనే జీవితం గడిపేస్తూ ఉంటారు. అయితే చాలామంది టాయిలెట్ వెళ్లినా కూడా మొబైల్ ఫోన్ తీసుకువెళ్లి అక్కడ కూడా ఫోన్ లోనే కాలక్షేపం చేస్తూ ఉంటారు అయితే ఇలా మొబైల్ ఫోన్ బాత్రూంలో వాడటం మంచిదేనా ఈ విషయాలు కనుక తెలిస్తే అసలు మొబైల్ ఫోన్ ఇక తీసుకోరని చెప్పాలి.
చాలామంది టాయిలెట్ వెళ్లినప్పుడు కూడా మొబైల్ తన వెంట తీసుకు వెళ్తూ ఉంటారు. ఇలా టాయిలెట్లో ఎక్కువసేపు కూర్చొని మొబైల్ ఫోన్ వాడటం వల్ల నడుము భుజాలు బిగుసుకుపోతాయి. దాని కారణంగా మీకు నొప్పి మొదలవుతుంది. ఇది మాత్రమే కాదు ఇది మీ శరీర రూపాన్ని కూడా పాడు చేస్తుంది.టాయిలెట్ సీటులో చాలా క్రిములు, బ్యాక్టీరియా ఉన్నాయి. మీరు బాత్‌రూమ్‌లో ఎక్కువసేపు కూర్చున్నప్పుడు అన్ని క్రిములు, బ్యాక్టీరియా శరీరంలోకి ప్రవేశించి తీవ్రమైన కడుపునొప్పి యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్లు ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయి.
ఇక టాయిలెట్ లో ఎక్కువసేపు ఉండటం వల్ల అక్కడున్నటువంటి బ్యాక్టీరియా వంటి క్రిములు మన సెల్ ఫోన్ పై కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. తద్వారా మనం తిరిగి సెల్ఫోన్ ఆపరేట్ చేయడం వల్ల ఆ బ్యాక్టీరియా మన చేతుల ద్వారా శరీరంలోకి ప్రవేశించి తీవ్రమైన అనారోగ్య సమస్యలను కూడా కలిగించే అవకాశాలు ఉంటాయి. అందుకే వీలైనంత వరకు మొబైల్ ఫోన్ ఎంత తక్కువగా ఉపయోగిస్తే అంత మంచిదే ముఖ్యంగా టాయిలెట్ కి అసలు తీసుకువెళ్లకూడదని నిపుణులు చెబుతున్నారు.