Health Tips: సాధారణంగా మనం మన అందం, ఆరోగ్యం విషయంలో ఎన్నో రకాల జాగ్రత్తలను తీసుకుంటూ ఉంటావు మన శరీరానికి కావలసిన పోషకాలు అందేలా జాగ్రత్తలు తీసుకుంటామో అయితే చాలామందికి చలికాలంలో పెదాలు విపరీతంగా పగులుతూ ఉంటాయి. ఇలా పెదాలు పగలటానికి కారణం లేకపోలేదు కారణంగా పెదాలు పగులుతూ ఉంటాయి కానీ ఎండాకాలంలో కూడా చాలామందికి పెదాలు పగలటం మనం చూస్తుంటాము.
ఈ విధంగా ఎండాకాలంలో పెదాలు పగులుతున్నాయి అంటే మీ శరీరంలో పోషకాల లోపం ఏర్పడిందని సంకేతం. సాధారణ పరిస్థితిలో పెదాలు కనుక పగులుతున్నాయి అంటే ఏమాత్రం అలసత్వం చేయకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎండాకాలంలో పెదాలు పగులుతున్నాయి అంటే సూర్య రష్మి తీవ్రత కారణంగా కూడా పెదవులు పగిలే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే ఎండాకాలంలో చాలా మంది డిహైడ్రేషన్ కి గురి అవుతూ ఉంటారు.
ఈ విధంగా డీహైడ్రేషన్ బారిన పడినా కూడా పెదాలు చీలికలు ఏర్పడతాయి. ఇక ఎప్పుడైతే విటమిన్ బి లోపం ఉంటుందో అప్పుడు పెదాలు పగలడం జరుగుతుంది. నవ్వుతున్నప్పుడు నోటి మూలల్లో పగుళ్లు కనిపిస్తే మాత్రం మీకు ఖచ్చితంగా విటమిన్ బి లోపం ఉన్నట్లేనని నిపుణులు చెబుతున్నారు. విటమిన్ బి అనేది నీటిలో కరిగే విటమిన్ల సమూహం. ఇవి శరీరంలోని వివిధ కార్యకలాపాలకు ఎంతో అవసరం అవుతుంది. అందుకే బి విటమిన్ పుష్కలంగా ఉండే పదార్థాలను తీసుకోవడం మంచిది ఎండాకాలంలో ఎక్కువగా నీటిని తీసుకోవటం వల్ల ఈ సమస్య నుంచి బయటపడవచ్చు.