Categories: Devotional

Devotional Facts: ప్రధాన ద్వారం వద్ద ఉండే గడప పై కాలు పెడుతున్నారా.. ఇది తెలుసుకోవాల్సిందే?

Devotional Facts: సాధారణంగా ఇంట్లో గడప మీద కాలు పెట్టడం మంచిది కాదని మన పెద్దలు చెబుతుంటారు. అంతే కాకుండా మహిళలు పొరపాటున కూడా గడప మీద కాలు పెట్టడం,లేదా గడప మీద కూర్చోకూడదు అని చెబుతుంటారు.అలా గడప మీద కాలు వేసి తొక్కితే మహా పాపమని మన పెద్దలు చెబుతూ ఉంటారు. అయితే నిజంగా గడప మీద కాలు వేయడం తప్పా? దీని వలన మనకు ఏమైనా సమస్యలు వస్తాయా? అనే విషయాలు గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ప్రస్తుత కాలంలో ఇంటిని నిర్మించుకునే సమయంలో ప్రధాన ద్వారం వద్ద తప్ప మిగిలిన ఏ గదులకు గడపలు ఉండవు. కానీ పూర్వం మాత్రం ప్రతి గదికి తప్పనిసరిగా గడప ఉండేది. అదికూడా చెక్కతో చేసిన గడప మాత్రమే ఉండేది.  అయితే చాలామంది ఆ గడపకి బొట్లు పెట్టి, పసుపు రాసి ఎంతో అందంగా అలంకరిస్తారు. ఇక శుక్రవారం నాడు లేదా ముఖ్యమైన పర్వదినాల్లో కానీ గడపలకి పూజ చేస్తూ ఉంటారు. పసుపురాసి, బొట్టు పెట్టి, పూజలు చేస్తూ ఉంటారు. కానీ ప్రస్తుత కాలంలో ముఖద్వారం వద్ద ఉన్న గడపకి పూజలు చేయడం కూడా కొంతమంది బరువుగా భావిస్తున్నారు.

మన పురాణాల ప్రకారం ముఖద్వారం వద్ద ఉన్న గడప లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. అందువల్ల ప్రతిరోజు ఉదయం ఇంటికి శుభ్రం చేయటంతో పాటు గడపని గంగాజలంతో శుభ్రం చేసి పసపు , కుంకుమ రాసి  అందంగా అలంకరిస్తారు. ఇలా గడపని ప్రతిరోజు అందంగా అలంకరించటం వల్ల లక్ష్మీదేవి ఆకర్షితురాలై మన ఇంట్లో అడుగుపెడుతుందని పెద్దల. అందుకే లక్ష్మీదేవి స్వరూపమైన గడపని తొక్క కూడదని మన పెద్దలు చెబుతుంటారు. అలాగే నరదిష్టి తగలకుండా ఉండాలంటే కూడా శుక్రవారం నాడు గడపకి పసుపు రాసి, కుంకుమ బొట్లు పెట్టి, నల్లటి పటిక కడితే నరదిష్టి కూడా పోతుంది.

Sravani

Recent Posts

Pawan Kalyan: ఉస్తాద్ భగత్‌సింగ్ బ్రేకీవెన్ కూడా కష్టమా?

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ సినిమా అంటే ప్రతీ ఒక్కరిలో ఉండే ఆతృత, ఆసక్తి ఊహించలేనిది. ఎన్ని సినిమాలు బాక్సాఫీస్…

2 days ago

Kadiri Narasimha Swamy: కదిరి లక్ష్మీ నరసింహునికి దాసోహమంటూ శ్రీమాలిక సమర్పణ!

*బాలకృష్ణ, బొల్లినేనికి ఈ.ఓ శ్రీనివాసరెడ్డి కృతజ్ఞతలు *ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో శ్రీమాలిక Kadiri Narasimha Swamy: కదిరి, మార్చి…

3 weeks ago

Pawan Kalyan: హైదరాబాద్‌లో ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ ప్రీరిలీజ్ ఈవెంట్..ఏ డేట్ లాకైందో తెలుసా?

Pawan Kalyan:హైదరాబాద్‌లో ఉస్తాద్ భగత్‌సింగ్ ప్రీరిలీజ్ ఈవెంట్..ఏ డేట్ లాకైందో తెలుసా? అంటూ ఇప్పుడు ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి…

3 weeks ago

Ram Charan: ‘పెద్ది’ ప్రమోషన్స్ నెక్స్ట్ లెవల్..క్లారిటీ ఇచ్చిన మేకర్స్ !

Ram Charan: మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న పాన్ ఇండియా సినిమా 'పెద్ది' నుంచి అప్‌డేట్స్ రావడం లేదని…

3 weeks ago

Mega 158: మెగా 158లో పవన్ భక్తుడు..అసలు నిజం ఇదే!

Mega 158: మెగాస్టార్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ మెగా 158 వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతోంది. గతంలో చిరుకి వాల్తేరు వీరయ్య…

4 weeks ago

Puranapanda Srinivas: హైదరాబాద్ టిటిడి ఉత్సవాల్లో హైలైట్‌గా పురాణపండ పుస్తకం

Puranapanda Srinivas: తిరుమల క్షేత్రమే తరలి వచ్చినట్లుగా వేల కొలది భక్తుల ఆనందోత్సాహాల మధ్య హైదరాబాద్ జూబిలీహిల్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి…

4 weeks ago

This website uses cookies.