Summer Season: సాధారణంగా పండ్లు తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఏ కాలంలో దొరికే పండ్లు ఆ కాలంలో తింటేనే ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ వేసవి కాలంలో లభించే పుచ్చకాయ, మామిడిపండు వంటి ఎన్నో రకాల పండ్లు రుచికరంగా మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడ ఎంతో మంచివి. అలాగే ఈ వేసవికాలంలో లభించే పండ్లలో ఈతపండ్లు కూడా ఒకటి. వేసవిలో ఈత పండ్లు తినడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇప్పుడు మనం వాటి గురించి తెలుసుకుందాం..
ఈత పండ్లలో గ్లూకోజ్, సుక్రోజ్, ప్రక్టోజ్ లు తక్షణ శక్తినిస్తాయి. వీటిని తినటం వల్ల శరీరానికి తక్షణ శక్తి అందించి వేసవిలో వచ్చే అలసట నుండి దూరం చేస్తుంది. ప్రతిరోజు ఉదయం ఈత పండ్లు జీర్ణశక్తి మెరుగు పడుతుంది. దీంతో అజీర్తి, మలబద్ధకం వంటి సమస్యలు పోతాయి. ఈత పండ్లలో ఐరన్ సంవృద్ధిగా ఉంటుంది. వీటిని తినటం వల్ల శరీరంలో రక్త శాతం కూడా పెరుగుతుంది. అలాగే రక్తప్రసరణ కూడా సక్రమంగా జరుగుతుంది.అలాగే ఎనిమియా సమస్యతో బాధపడేవారు ఈత పండ్లను తినడం వల్ల ఆ సమస్య నుంచి బయటపడవచ్చు.
ముఖ్యంగా వేసవిలో దొరికే ఈ పండ్లను తినటం వల్ల శరీరంలో వేడి తగ్గుతుంది. వేసవికాలంలో అధిక ఉష్ణోగ్రతల వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. అటువంటి సమయంలో ఈత పండ్లు తినడం వల్ల శరీర ఉష్ణోగ్రతలు తగ్గుతాయి. అలాగే ఈత పనులు రోగనిరోధక గుణాలు ఎక్కువగా ఉంటాయి. ఇది ఆంటీబయాటిక్ గా పనిచేసే సీజనల్ వ్యాధులు దరిచేరకుండా కాపాడుతాయి. ఇన్ని ప్రయోజనాలు ఉన్న ఈత పండ్లు తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిది.
Srinidhi Shetty: కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టికి తెలుగులో ఇప్పటి వరకూ సాలీడ్ దక్కలేదు. కన్నడలో ఆమె నటించిన కేజీఎఫ్…
Tollywood: నేచురల్ స్టార్ నాని నటించబోతున్న లేటెస్ట్ మూవీ బ్లడీ రోమియో. సుజీత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రస్తుతం,…
Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…
Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…
Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…
Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…
This website uses cookies.