Dasara Festival: హిందువులు ప్రతి ఏడాది ఎన్నో పండుగలను ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ఇలా హిందువులు జరుపుకునే అతి పెద్ద పండుగలలో దసరా పండుగ ఒకటి. దసరా పండుగను జరుపుకోవడం వెనుక ఎన్నో పురాణ కథలు ఉన్నాయి అనే విషయం మనకు తెలిసిందే. పాండవులు కౌరవులపై విజయం సాధించిన రోజుగా కూడా ఈ రోజున భావిస్తారు. అలాగే రావణ సంహారం జరిగిన రోజు అని కూడా చెబుతారు. పురాణాల ప్రకారం ఈ పండుగ వెనుక అన్ని విజయాలే ఉన్నాయి కనుక ఈ పండుగను విజయదశమి అని కూడా పిలుస్తారు.
ఇక దసరా రోజు ఎంతోమంది ఎన్నో రకాలుగా పూజలు చేసుకుంటారు. దసరా పండుగ రోజు చాలామంది జమ్మి చెట్టుకు పూజ చేయడం మనం చేస్తుంటాం అయితే ఇలా దసరా పండుగ రోజు జమ్మి చెట్టుకు పూజ చేయడం వెనుక ఉన్న కారణం ఏంటి అసలు జమ్మి చెట్టుకు ఎందుకు పూజ చేస్తారనే విషయాన్ని వస్తే… జమ్మి చెట్టుకు పూజ చేయటాన్ని శమీ పూజ అని కూడా పిలుస్తారు. ఈ పండుగ రోజు జమ్మి చెట్టుకు పూజ చేసి జమ్మి ఆకు తీసుకొని పెద్దలకు ఇచ్చే వారి పాదాలకు నమస్కరించడం ఆనవాయితీగా వస్తుంది.
ఇలా దసరా పండుగ రోజు జిమ్మీ ఆకులను పెద్దలకు ఇచ్చి ఆశీర్వాదం తీసుకోవడం జమ్మి చెట్టుకు పూజ చేయడం వెనుక ఉన్న కారణం ఏంటి అనే విషయానికి వస్తే… పురాణాల ప్రకారం రాక్షసులు దేవతలు సాగరమదనం చిలికిన సమయంలో సముద్ర గర్భం నుంచి జమ్మి వృక్షం కూడా వస్తుంది. రాముడు సీతాదేవిని తీసుకురావడం కోసం లంకపై దాడి చేస్తారు. అయితే లంకకు యుద్ధానికి బయలుదేరే ముందు రాముడు శమీ పూజ చేసి బయలుదేరారని పురాణాలు చెబుతుంటాయి. అజ్ఞాతవాసం తర్వాత కౌరవులపై పాండవులు దండెత్తడం కోసం శమీ వృక్షంపై దాచి ఉన్నటువంటి ఆయుధాలను బయటకు తీసి పూజించి కౌరవులపై గెలుపొందారని చెబుతారు. ఇలా జమ్మి చెట్టును నమస్కరించి యుద్ధానికి బయలుదేరిన వీరందరూ కూడా విజయం సాధించారు.అందుకే దసరా పండుగ రోజు జమ్మి వృక్షానికి కనుక పూజ చేస్తే మనం చేసే పనులలో కూడా అపజయం ఉండదని విజయం తప్పకుండా వరిస్తుందని నమ్ముతారు కనుక దసరా పండుగ రోజు ప్రత్యేకంగా ఈ జమ్మి చెట్టుకు పూజలు చేస్తారు.