Health Tips: ప్రతిరోజు ఉదయం చాలామంది అల్పాహారం తీసుకుని వారి వారి పనులకు వెళ్తూ ఉంటారు. ఇక ఇటీవల కాలంలో చాలామంది ఏ మాత్రం సమయం లేకపోవడంతో మార్కెట్లో దొరికే ఇన్స్టంట్ పిండిని ఇంట్లో పెట్టుకుని వాటితో టిఫిన్ చేసుకుని వెళ్తూ ఉంటారు. అలాగే చాలామంది పిల్లలు దోసే ఇడ్లీ పిండిని ఎక్కువగా తయారు చేసుకుని ఫ్రిజ్లో నిల్వ చేసుకుంటూ ఉంటారు. ఇక ఆ పిండితో ప్రతిరోజు ఏదో ఒక వెరైటీ చేసుకుని తింటూ ఉంటారు అయితే ఇలా ఫ్రిజ్లో నిలువ చేసుకున్న పిండిని తినడం మంచిదేనా అంటే నిపుణులు మంచిది కాదని చెబుతున్నారు.
మనం ఇంట్లో తయారు చేసుకున్న దోస లేదా ఇడ్లీ పిండి 24 గంటల తర్వాత బాగా పులిసిపోతుంది. తద్వారా పిండి రుచి వాసన కూడా మారిపోతుంది అలాంటి పిండితో మనం ఆహార పదార్థాలను తయారు చేసుకుని తినటం వల్ల ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి. ఆ పిండిని ఫ్రిడ్జ్ లోకి పెట్టిన లేదా బయటపెట్టిన కూడా 24 గంటల తర్వాత పులిసిపోతుంది.
ఈ విధంగా పులిసిన పిండిని తినడం వల్ల అజీర్తి, కడుపులో మంట, ఇన్ఫెక్షన్, గ్యాస్ వంటి సమస్యలు తలెత్తుతాయి. అందుకే పులిసిన పిండిని ఎట్టి పరిస్థితుల్లో తినకూడదు. అలాగే ఇడ్లీ, దోసె పిండిని రుబ్బిన 24 గంటల్లోనే తీనేయాలని నిపుణులు చెబుతున్నారు. ఇక మార్కెట్లో లభించే వాటిని తినకపోవడం చాలావరకు మంచిదని నిపుణులు చెబుతున్నారు. మనం ఇంట్లో ఫ్రెష్ గా తయారు చేసుకునే పిండిని తినటం మంచిది.