Peanuts: వేరుశెనగ గింజలు ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఇవి నిల్వ ఉంటాయి మనం ఏదైనా ఉదయమే అల్పాహారం చేయాలి అంటే వేరుసెనగ గింజలతో చట్నీలు చేయడం ఇతర ఆహార పదార్థాలు తయారు చేసుకోవడం అలాగే పులిహోర వంటి వాటిలోకి తాలింపుగా వేసుకోవడం చేస్తుంటాము కనుక ప్రతి ఒక్క ఇంట్లో కూడా వేరుసెనగ విత్తనాలను నిల్వచేసి పెట్టుకుంటాము. అయితే వేరుశనగలతో తయారు చేసిన వంటలు రుచిగా ఉండటమే కాకుండా ఈ వేరు శెనగను మనం తీసుకోవడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలను కూడా పొందుతామని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
వేరుశెనగ గింజలలో ఎన్నో రకాల ప్రోటీన్లు విటమిన్ లో ఉన్నాయి అందుకే వేరుశెనగలను తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. ఇక వేరు శనగలను చిక్కి రూపంలో తయారు చేసుకొని తింటూ ఉంటారు అయితే ప్రతిరోజు ఉదయం 10 నానబెట్టిన వేరుసెనగ విత్తనాలను తినటం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు.
నానబెట్టిన వేరుశనగలో నియాసిన్, విటమిన్ బి3 మరియు ఆరోగ్యకరమైన కొవ్వు ఆమ్లాలు ఉండటం వల్ల మీ మెదడు మెరుగ్గా పని చేస్తుంది. అభిజ్ఞా పనితీరును మెరుగుపడుతుంది. అలాగే నానబెట్టిన వేరుశనగల్లో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్‌తోపోరాడటానికి మరియు శరీరంలోని క్యాన్సర్ కణాల వ్యాప్తిని ఆపడానికి ఉత్తమంగా సహాయపడతాయి. ఇక వేరుశెనగ గింజలు శరీరంలో జీర్ణక్రియ రేటును మెరుగుపరుస్తుంది. నానబెట్టిన వేరుశగలు వెయిట్ లాస్ ను ప్రపోట్ చేస్తాయి. వేరుశనగలు ప్రోటీన్, ఫైబర్ యొక్క గొప్ప మూలకం. ఒక గుండె సంబంధిత వ్యాధులతో బాధపడేవారు ఈ గింజలను తీసుకోవడం వల్ల ఈ సమస్య నుంచి కూడా బయటపడవచ్చు.