Devotional Tips: సాధారణంగా మనం మన కుటుంబ సభ్యులతో కలిసి గడిపిన అందమైన క్షణాలను ఎప్పటికీ గుర్తుంచుకోవడం కోసం ఎన్నో రకాల జ్ఞాపకాలను దాచుకుంటాము అలాంటి వాటిలో ఫోటో ఫ్రేమ్స్ కూడా ఒకటి. అయితే చాలామంది బ్రతికున్నప్పుడు కలిసి తీసుకున్నటువంటి ఫోటో ఫ్రేమ్ చేయించి పెడతాము అయితే ఉన్నఫలంగా ఒకరు చనిపోయి మరొకరు బ్రతికే ఉంటారు. అయితే ఇలాంటి ఫోటోలు ఇంట్లో ఉండవచ్చా లేకపోతే చనిపోయిన వారి ఫోటోతో బ్రతికున్న వారి ఫోటో పెట్టి ఒకే ఫ్రేమ్ చేయించుకోవచ్చా ఈ విషయం గురించి పండితులు ఏం చెబుతున్నారు అనే విషయానికి వస్తే…
వాస్తు నిపుణుల అభిప్రాయం మేరకు బ్రతికున్నవారు చనిపోయిన వారి ఫోటో ఫ్రేమ్స్ ఇంట్లో అసలు చేయించి పెట్టకూడదు ఇలా చేయించి పెట్టడం వల్ల బ్రతికున్న వారి ఆయుష్షు క్షీణిస్తుంది అందుకే ఎప్పుడూ కూడా బ్రతికున్న వారి ఫోటోతో పాటు చనిపోయిన వారి ఫోటో ఫ్రేమ్ చేయించకూడదు. అలాగే చాలామంది ఇంట్లో వారికి ఇష్టమైనటువంటి వారు లేదా పెద్దవారు చనిపోయినప్పుడు వారికి గౌరవం ఇస్తుంది దేవుడు గదిలో దేవుడు ఫోటోలతో పాటు వీరి ఫోటోలను పెట్టి కూడా పూజిస్తుంటారు.
ఇలా దేవుడి గదిలో చనిపోయిన వారి ఫోటోలను పెట్టి ఎప్పుడు కూడా పూజ చేయకూడదట. అలాగే ప్రతిరోజు ఉదయం లేవగానే చనిపోయిన వారి ఫోటోవైపు మనం చూడటం వల్ల వారి ఆశీస్సులు మనపై ఉంటాయని అందరు భావిస్తారు. కానీ లేచిన వెంటనే ఇలా చనిపోయిన వారి ఫోటోని చూడటం వల్ల ఆర్థిక సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయని తెలుస్తుంది. అయితే చనిపోయిన వారి ఫోటోలు ఎప్పుడు కూడా సరైన దిశలో పెట్టడం వల్ల ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఉండవని పండితులు చెబుతున్నారు. అయితే చనిపోయిన వారి ఫోటోలు ఎప్పుడూ కూడా ఉత్తర దిశ వైపు గోడకు వేలాడదీసి వారి మొహం దక్షిణ దిశ వైపు ఉండేలాగా ఏర్పాటు చేయాలి ఇలా చేయడం ఎంతో మంచిది.