Honey: ఉసిరికాయను ప్రతిరోజు ఏదో ఒక రూపంలో ఆహారంగా తీసుకుంటే మన శరీరానికి అవసరమైన సూక్ష్మ పోషకాలు, స్థూల పోషకాలు సమృద్ధిగా లభించడంతోపాటు మారుతున్న కాలానికి అనుగుణంగా వస్తున్న ఉన్న కొత్త కొత్త వ్యాధులను సైతం ఎదుర్కొనే ఇమ్యూనిటీ సిస్టం మనలో అభివృద్ధి చెందుతుంది. సాధారణంగా ఉసిరికాయను పచ్చడి రూపంలో ఎక్కువగా తింటుంటారు. ఉసిరికాయను తేనెతో కలిపి జామ్ తయారు చేసుకొని తింటే అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు మీ సొంతమైనట్లే అదెలాగో ఇప్పుడు చూద్దాం.
ముందుగా ఉసిరికాయ జామ్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. తాజా ఉసిరికాయలను సేకరించి వీటిని శుభ్రంగా కడుక్కోవాలి. తర్వాత మంచి నాణ్యమైన తేనెను ఒక జార్లో వేసి అందులో మనం సేకరించుకున్న ఉసిరికాయలను కొన్ని రోజులు పాటు మూత పెట్టి ఉంచితే ఉసిరికాయలోని ఔషధ గుణాలు తేనెలోనీ ఔషధ గుణాలతో కలిసిపోయి ఉసిరికాయ జామ్ లాగా తయారవుతుంది. రుచికరమైన ఉసిరికాయ జామ్ ను ప్రతిరోజు కొద్దికొద్దిగా తినడం అలవాటు చేసుకోవడం మంచిది.
ప్రతిరోజు ఉసిరికాయ జామ్ ను తినడం వల్ల ఉసిరికాయలో పుష్కలంగా ఉన్న సి విటమిన్ తేనెలోని యాంటీ మైక్రోవేల్ గుణాలు వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించి సీజనల్గా వచ్చే జలుబు ,దగ్గు , తుమ్ములు, గొంతు నొప్పి వంటి సమస్యలను దూరం చేస్తుంది. అలాగే తేనెలోని ఔషధ గుణాలు మనలో జీర్ణక్రియ రేటును పెంచి ఆకలిని పెంచుతుంది.
ఉసరిలో అధికంగా ఉన్న పీచు పదార్థం జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగుపరిచి మలబద్ధకం, గ్యాస్ట్రిక్ , మొలల సమస్యలను తొలగిస్తుంది.ఉసిరికాయలను మరియు తేనెలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్ మన శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ ని తగ్గించడంలో పూర్తిగా దోహదం చేసి రక్త ప్రసరణ వ్యవస్థను కూడా మెరుగుపరుస్తుంది తద్వారా గుండె సమస్యలను కూడా అరికట్టవచ్చు.
Virinchi Varma: సినిమా ఇండస్ట్రీలో ఒక్కో దర్శకుడి ఒక్కో అభిరుచి ఉంటుంది. దాని ప్రకారమే వారు ఎంచుకునే కథ, కథనాలు…
Raashii Khanna: పెళ్ళి, పిల్లలు నా వ్యక్తిగతం..దాని గురించి చర్చ ఎందుకు..? అంటోంది అందాల తార రాశిఖన్నా. ఊహలు గుసగుసలాడే…
Tollywood: 'నువ్వు నందా అయితే నేను బద్రి బద్రీనాద్ అయితే ఏంటీ'? 'ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాకైపోద్దో…
SSMB29: సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి కాంబినేషన్‌లో ఓ భారీ అడ్వంచర్ మూవీకి…
The Raja Saab: పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం 'రాజా సాబ్'. మిగతా భాషల్లో 'ది…
Tollywood: పవన్ ఈజ్ బ్యాక్.. 2025 లో వీరమల్లు, ఓజీ ఒకదాని తర్వాత ఒకటి అత్యంత భారీ స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా…
This website uses cookies.