Health: సాధారాణంగా మనం కొన్ని వంటకాలలో క్యారెట్‌ను ఎక్కువగా వాడుతుంటాము. అంతేకాదు, ఉదయం క్యారెట్ జ్యూస్ త్రాగేవారూ ఎక్కువశాతమే ఉన్నారు. కానీ, కొందరు క్యారెట్ వల్ల పొందే లాభాలను మాత్రం అంతగా తెలుసుకోలేరు. సరదాగా క్యారెట్ తినేవారూ కొందరున్నారు. అయితే, అలాంటి వారూ చాలా లాభాలనే పొందుతున్నారు. చిన్నతనం నుంచి క్యారెట్ తింటే బ్లడ్ బాగా శరీరంలో ఉత్పత్తి అవుతుందని చెబుతుంటారు. కంటి చూపుకి కూడా ఇది మేలు చేస్తుంది. మరి క్యారెట్ తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఇవి మాత్రమేనా అంటే కాదు. ఇంకా చాలానే ఉన్నాయి.
వాతావరణంలో వస్తున్న మార్పులతో కాలుష్యం ప్రతి రోజు పెరిగిపోతూనే ఉంది. ముఖ్యంగా వాయు కాలుష్యం ప్రపంచంలో ప్రమాదకర స్థాయిలోఉందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వాహనాల వినియోగం పెరిగిపోవడంతో, పారిశ్రామికీకరణ కారణంగా గాలిలోకి వెదజల్లే ప్రమాదకర వాయువులు మొత్తం పొల్యూట్ చేస్తున్నాయి. ఈ కాలుష్యం కారణంగా ప్రజలు ఎన్నో రోగాల బారిన పడుతున్నారు. ముఖ్యంగా పట్టణాలలో ఉండే ప్రజలు అయితే అత్యంత ప్రమాదకరమైన వాతావరణంలో జీవిస్తున్నారు.
భారత్ లో అయితే ఈ వాయుకాలుష్యం తీవ్రత గత రెండు దశాబ్దాల కంటే రెండున్నర రెట్లు పెరిగిందని పరిశోధనలు తెలుపుతున్నాయి. ఇక ఏటా ఈ వాయుకాలుష్యం కారణంగా 70 లక్షల మందికి పైగా ప్రాణాలు కోల్పోతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా తెలియజేసింది. ఇక వాయు కాలుష్యం కారణంగా వాతావరణంలో కూడా ఊహించని మార్పులు చోటు చేసుకుంటున్నాయి. వేసవి ఉష్ణోగ్రతలు పెరిగిపోయాయి. అలాగే తుఫాన్ ల ప్రభావం పెరిగింది. చలి తీవ్రత కూడా ప్రమాదకర స్థాయిలో మైనస్ డిగ్రీలకి పడిపోతుంది.
అలాగే సీజన్ తో సంబంధం లేకుండా ఇవన్నీ జరుగుతున్నాయి. ఇక ఈ వాయు కాలుష్యం కారణంగా ఉదయం బయటకి వెళ్లి సాయంత్రం ఇంటికి వచ్చే సరికి ఎన్నో ప్రమాదకర ధాతువులు ఒంటిపైకి, శరీరంలోకి చేరుతున్నాయి. కొంత మంది ఈ కాలుష్యంలోనే ఉద్యోగాలు చేస్తూ ఉంటారు. ఈ కారణంగా రకరకాల రోగాల బారిన పడుతూ తక్కువ వయస్సులోనే మృత్యువాత పడుతున్నారు. అలాగే క్యాన్సర్ బారిన పడుతున్నారు. ఊపిరితీత్తుల సమస్యతో సతమతం అవుతున్నారు. అయితే ఈ వాయుకాలుష్యంతో ప్రమాదక కార వ్యాధుల బారిన పడకుండా ఉండాలంటే మన ఆహారపు అలవాట్లు మార్చుకోవాలని డాక్టర్లు కూడా సూచిస్తున్నారు.
ముఖ్యంగా ప్రతి రోజు క్యారెట్, కొత్తిమీర తింటే శరీరంలో కాలుష్య కారకాలని బయటకి పంపిస్తాయి. ఇవి శరీరంలో కాలుష్య కారకాలని బయటకి పంపడటంలో ఎంతో ప్రభావవంతంగా పని చేస్తున్నాయని అమెరికాలో డెలావర్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు ప్రయోగాత్మకంగా నిరూపించారు. ఇప్పటికే చాలా మంది తమ ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకొని ఆరోగ్యకరమైన ఆహార పదార్ధాలు తీసుకోవడం మొదలు పెట్టారు. అయితే సేంద్రీయ పద్ధతిలో పండించే ఆహార పదార్ధాలని మాత్రమే తీసుకుంటే ప్రయోజనం ఉంటుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్న మాట.