Tulasi: చాలామందికి తులసి మొక్కను ఇంట్లో పెట్టుకుంటే మంచిదనే విషయం మాత్రమే తెలుసు. అయితే, ఈ తులసిలో ఎన్ని రకాలున్నాయి..శాస్త్రీయపరంగా ఎలాంటి పేరుతో పిలుస్తారు..ఇంట్లో ఏ దిశలో పెట్టుకుంటే లాభాలుంటాయి అనే పలు ముఖ్యమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
తులసిని మంచి ఔషధంగా ఉపయోగిస్తారు. అలాగే మన హిందూ సంప్రదాయాలలో ఈ తులసికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ తులసి మొక్కలో రెండు రకాలుంటాయి. ఇక తులసికి శాస్త్రీయ పరంగా ఓసిమం టెన్యూఫ్లోరం అనే పేరుంది. ఈ తులసి మొక్కలో రెండు వేరు వేరు రంగులలో కనిపిస్తాయి. ఒకటి ముదురు రంగులో ఉండేరకం. దీనిని కృష్ణ తులసి అంటారు. ఇక కాస్త లేత రంగులో కనిపించే దాన్ని రామతులసి అని పిలుస్తారు. అయితే ఎక్కువశాతం మాత్రం కృష్ణతులసినే పూజకు ఉపయోగిస్తారు.
అంతేకాదు, ఆయుర్వేదం మందులలోనూ ఈ కృష్ణతులసినే మెజారిటీ భాగం జనాలు ఉపయోగిస్తుంటారు. ప్రస్తుతం ఈ తులసికి విదేశీయులు కూడా ప్రాధాన్యత ను ఇస్తున్నారు. హిందువులలో మాత్రమే కాదు, నార్త్ వైపువారు కూడా ఈ తులసిని పరమ పవిత్రంగా భావించి ఇంట్లో కోటను నిర్మించి ప్రతీరోజు సూర్యోదయం, సూర్యాస్తమయం సమయంలో ప్రార్ధిస్తుంటారు. అంతేకాదు, వారంలోని ప్రత్యేకమైన రోజులు సోమ, బుధ, గురు, శుక్ర, శని వారాలలో తప్పనిసరిగా పూజిస్తుంటారు. కొందరైతే ప్రతీరోజూ ఉదయం సూర్యోదయం వేళల్లో పూజించి నైవేద్యం సమర్పిస్తుంటారు. అ హిందువులు ఈ తులసి ఆకులను దేవతలకు అర్చన సమయంలో ఉపయోగిస్తారు.
ప్రతీ హిందూ దేవాలయాలలో పూజారులు ఇచ్చే తీర్థం తులసి ఆకులతో తయారు చేసినదే కావడం గొప్ప విశేషం. ఇక దేవుడు మెడలోనూ తులసి మాలను వేసి పూజ చేస్తారు. ఇక మనలో చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే వినాయక చవితి రోజు చేసే వరసిద్ధివినాయక ఏకవింశతి పత్రి పూజా క్రమములో ఈ తులసి ఆకు ఏడవది కావడం గొప్ప విశేషమని చెప్పాలి. ఆడవాళ్ళు తమ పసుపు కుంకుమలు పదిలంగా ఉండాలని భక్తితో తులసమ్మను పూజిస్తారు.
చాలామంది వర్షాకాలంలో జలుబు, దగ్గుతో బాధపడుతుంటారు. అలాంటి వారు కొన్ని తులసి ఆకులను తీసుకొని రసంగా చేసుకొని రెండు టీ స్పూన్ల చొప్పున మూడు నాలుగు రోజులు తీసుకోవాలి. పాలు, లేదా టీలో కూడా ఈ తులసి ఆకు రసం కలుపుకొని తాగడం వల్ల జలుబు, దగ్గు నయం అవుతాయి. అంతేకాదు, కొందరిలో జీర్ణ శక్తి సరిగా పనిచేయదు. అలాంటి వారు కూడా ఉదయం పూట నాలుగైదు తులసి ఆకులను తింటే జీర్ణ సమస్యతో పాటు ఉదర సంబంధిత సమస్యలు తగ్గుతాయి.
డెంగ్యూ, మలేరియా జ్వరం తీవ్రమైనప్పుడు తులసి ఆకులను ఓ గ్లాసు నీటిలో కలిపి వేడి చేసి త్రాగితే త్వరగా జ్వరం నయం అవుతుంది. కొందరిలో ఊపిరి తీసుకోలేనంతగా దగ్గు వస్తుంటుంది. అలాంటి సమయంలో ఐదారు తులసి ఆకులను రెండు మూడు మిరియాల గింజలు, ధనియాలతో కలిపి మెత్తగా పౌడర్‌లా చేసుకొని తింటే దగ్గు నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇలాంటి మరెన్నో తులసి వలన ఉన్నాయి. కాబట్టి క్రమం తప్పకుండా రోజు రెండు మూడు తులసి ఆకులను తినడం మాత్రం చేయండి.
Game Changer: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, క్రియేటివ్ జీనియస్ శంకర్ షణ్ముగ్ కాంబినేషన్లో రూపొందిన సినిమా ‘గేమ్ ఛేంజర్’.…
Tollywood Exclusive: 2000 సంవత్సరం తర్వాత నటుడు, నిర్మాత అశోక్ కుమార్ తన బ్యానర్ లో ఒక సినిమాకు శ్రీకారం…
The Rana Daggubati Show Trailer: త్వరలో పాపులర్ ఓటీటీ అమెజాన్ ప్రైం లో టాలీవుడ్ టాల్ హీరో అయిన…
Bhagyashri Borse: తాజాగా సోషల్ మీడియాలో ఓ వార్త బాగా వైరల్ అవుతోంది. మాస్ మహారాజా రవితేజ-డైరెక్టర్ హరీశ్ శంకర్…
Virinchi Varma: సినిమా ఇండస్ట్రీలో ఒక్కో దర్శకుడి ఒక్కో అభిరుచి ఉంటుంది. దాని ప్రకారమే వారు ఎంచుకునే కథ, కథనాలు…
Raashii Khanna: పెళ్ళి, పిల్లలు నా వ్యక్తిగతం..దాని గురించి చర్చ ఎందుకు..? అంటోంది అందాల తార రాశిఖన్నా. ఊహలు గుసగుసలాడే…
This website uses cookies.