Categories: Tips

Director Shankar: శంకర్ సినిమాలు యువతకు టెక్నాలజీ మీద ఆసక్తి కలిగేలా చేస్తున్నాయి

Director Shankar: మన సౌత్ సినిమా ఇండస్ట్రీలో పక్కా కమర్షియల్ డైరెక్టర్స్ ఉన్నారు. బాపు – రమణ, కె విశ్వనాథ్ వంటి క్లాస్ చిత్రాలను తీసిన అగ్ర దర్శకులూ ఉన్నారు. అందరిలోనూ క్రియేటివ్ జీనియస్ శంకర్ శైలి వేరే. ఆయన సినిమా కథాంశాలు అన్నీ కూడా సోషల్ మెసేజ్‌తో కూడుకుని ఉంటాయి. అంతే కాదు ఎప్పటికప్పుడు వస్తున్న సరికొత్త టెక్నాలజీని ఉపయోగించుకునేలా కథ, కథనాలు రచిస్తుంటారు. ఉదాహరణకు రోబో సిరీస్. ప్రపంచ వ్యాప్తంగా రొబొటిక్ టెక్నాలజీ రాబోతుందనే విషయాన్ని దాని ప్రాచుర్యం, ప్రపంచం మొత్తం ఎంతగా ఈ టెక్నాలజీపై ఆధారపడుతుందీ అనే అన్‌బిలీవబుల్ విషయాలను సినిమా ద్వారా చెప్పారు.

ఇప్పటికే కొన్ని దేశాలలో రొబొటిక్ టెక్నాలజీను వాడుతున్నారు. సోషల్ వెబ్  సైట్స్‌ ను ప్రస్తుతం రివ్యూ చేయడంలో రొబోస్ పాత్ర కీలకంగా మారింది. అంతేకాదు, పై స్థాయి చదువులలో టెక్నాలజీ పరంగా అంటే ఎక్కువ మంది రొబొటిక్ టెక్నాలజీనే ఎంచుకుంటున్నారు. ఇప్పటి వరకు అన్నీ పనులు మనుషులే చేశారు. కానీ, ఇకపై సగం శాతం రోబోస్ చేస్తాయి. యుద్ధాలలోనూ, ఆసుపత్రులలోనూ, కన్‌స్ట్రక్షన్ అలాగే మరెన్నో భారీ స్థాయిలో చేసే పనులన్నీ ఈ రోబొటిక్ టెక్నాలజీనే చేయనుంది. అయితే, మన భారత దేశంలో ఎక్కువ మంది విద్యార్థులు ఈ టెక్నాలజీని ఎంచుకోవడానికి కారణం శంకర్ రూపొందించిన రోబో సినిమానే అని చెప్పక తప్పదు.

director-shankar-creating intrest on technology to youth

Director Shankar: సినిమాలు అందరికీ ఎంతో ఇన్స్పిరేషన్‌గా నిలుస్తున్నాయి.

ఈ సినిమా ఘన విజయం సాధించింది. అయితే, దీనికి కొనసాగింపుగా వచ్చిన రోబో 2.ఓ మాత్రం ఆశించిన సక్సెస్ సాధించలేదు. కానీ, ఈ మూవీలో శంకర్ చూపించిన టెక్నికల్ విషయాలు మాత్రం విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడ్డాయి. ముఖ్యంగా సెల్‌ఫోన్ వల్ల ఎన్ని లాభాలున్నాయో అన్నీ నష్టాలూ ఉన్నాయని రోబో 2.ఓ సినిమాలో చూపించడం ఆసక్తికమైన విషయం. ఐ సినిమాలోనూ జనటిక్ డిజార్డర్ గురించి వివరించాడు. ఒక మనిషి రక్తంలోకి వైరస్ పంపితే దానివల్ల ఆ మనిషి ఆకారంలో ఎలాంటి మార్పు వస్తుంది..సమాజం ఆ మనిషిని ఎలా చూస్తుంది..అనే ఎమోషనల్ అంశాలను జోడించి తెరకెక్కించారు.

ఇక గతంలో ఒకే ఒక్కడు, భారతీయుడు లాంటి సోషల్ మెసేజ్‌తో కూడుకున్న కమర్షియల్ సినిమాలు తీసి భారీ సక్సెస్ అందుకున్నారు. ఒకే ఒక్కడు సినిమాలో ఒక్క రోజు సీఎం అయితే ..ఆ అవకాశం ఒక సామాన్యుడికి వస్తే ఎలాంటి ఫలితాలుంటాయి.. ఆ ప్రభావం ఎలా ఉంటుంది అనే అంశాలను ఎంతో ఆసక్తికరంగా చూపించారు. ఇక భారతీయుడు సినిమాలో లంచం తీసుకున్నవాడు కన్న కొడుకైనా నేరం చేసినట్టే..అలాంటి వాడిని చంపడానికి కూడా వెనకాడకూడదు అనే హెవీ ఎమోషనల్ కంటెంట్‌తో భారతీయుడు సినిమాను తెరకెక్కించారు. ఇలా ఆయన తీసే సినిమా సమాజం మీద ప్రభావం చూపేలా సమాజంలో జరుగుతున్న పొరపాట్లను వివరిస్తూ తీస్తున్న సినిమాలు అందరికీ ఎంతో ఇన్స్పిరేషన్‌గా నిలుస్తున్నాయి.

VSR

విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.

Recent Posts

Srinidhi Shetty: ‘ఆదర్శ కుటుంబం’ శ్రీనిధికి టాలీవుడ్‌లో ఆఫర్స్ తెస్తుందా?

Srinidhi Shetty: కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టికి తెలుగులో ఇప్పటి వరకూ సాలీడ్ దక్కలేదు. కన్నడలో ఆమె నటించిన కేజీఎఫ్…

1 week ago

Tollywood: నాని ‘బ్లడీ రోమియో’లో ఎంతమంది హీరోయిన్స్?

Tollywood: నేచురల్ స్టార్ నాని నటించబోతున్న లేటెస్ట్ మూవీ బ్లడీ రోమియో. సుజీత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రస్తుతం,…

1 week ago

Puranapanda Srinivas: పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది

Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…

4 weeks ago

Eating An Apple: పడుకునే ముందు యాపిల్ తినడం మంచిదేనా…ఇది తెలుసుకోవాల్సిందే!

Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…

4 weeks ago

Tirumala Hundi: రికార్డు స్థాయిలో తిరుమల హుండీ ఆదాయం.. ఆరోజు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు!

Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…

4 weeks ago

Kidney Health: ఉదయం లేవగానే ఈ తప్పులు చేస్తున్నారా… మీ కిడ్నీ ప్రమాదంలో పడినట్లే?

Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…

1 month ago

This website uses cookies.