Devotional Tips: మన హిందూ సంప్రదాయాలు ప్రకారం ప్రతి ఒక్కరు కూడా ప్రతిరోజు పూజలు చేస్తూ దేవదేవతలకు నమస్కరిస్తూ ఉంటాము. అయితే పూజ చేసిన తర్వాత చాలామంది వివాహమైనటువంటి మహిళలు తమ మంగళసూత్రానికి పసుపు కుంకుమలతో పాటు హారతి కూడా తీసుకుంటూ ఉంటారు. ఇలా మంగళసూత్రానికి హారతి ఇవ్వటం వల్ల తన భర్త ఆయుష్షు పెరుగుతుందని తమ మాంగల్య బలపడుతుందని భావిస్తూ ఉంటారు. అయితే పూజ చేసిన తర్వాత మంగళసూత్రానికి ఎట్టి పరిస్థితులలో కూడా హారతి ఇవ్వకూడదని పండితులు చెబుతున్నారు.
పూజ పూర్తి అయిన తర్వాత మహిళలు తమ మంగళసూత్రానికి పసుపు కుంకుమలు పెట్టుకోవడం ఎంతో మంచిది ఇలా పసుపు కుంకుమలు పెట్టుకోవడం వల్ల తమ భర్త ఆయుష్షు పెరుగుతుందని వారు దీర్ఘసుమంగళీగా ఉంటారని పండితులు తెలియజేస్తున్నారు అయితే హారతి మాత్రం మంగళసూత్రానికి ఇవ్వకూడదు. మంగళ సూత్రానికి హారతి ఇవ్వటం వల్ల భర్త ఆయుష్షు క్షీణిస్తుంది. అలాగే తమ భర్త ఎన్నో ఆర్థిక ఇబ్బందులను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది.
ఇలా మంగళసూత్రానికి హారతులు తీసుకోవటం వల్ల భర్త ఆయుష్షు క్షీణించడమే కాకుండా ప్రమాదాలు జరగడం శత్రువులు పెరగడం అనుకున్న పనులు జరగకపోవడం వంటివి జరుగుతాయని అందుకే మంగళ సూత్రానికి కేవలం పసుపు కుంకుమలతో మాత్రమే పూజ చేసిన పొరపాటున కూడా హారతులు ఇవ్వకూడదని పండితులు తెలియజేస్తున్నారు. ఇక వివాహమైనటువంటి మహిళలు తప్పనిసరిగా చేతికి గాజులు నుదుటిన సింధూరం తప్పనిసరిగా పెట్టుకోవాలి అలా పెట్టుకోవడం వల్ల భర్త ఆయుష్షుకి ఎంతో మంచిది అని పండితులు చెబుతున్నారు.