Saturday: హిందువులు ఎక్కువగా కొలిచే దేవుళ్ళలో హనుమంతుడు కూడా ఒకరు. కొంతమంది హనుమంతుడిని మంగళవారం పూజిస్తే మరి కొందరు శనివారం పూజిస్తూ ఉంటారు. అయితే శనివారం రోజు హనుమంతుడికి అంకితం చేయబడింది. కాబట్టి ఈ రోజున ఆయనను భక్తిశ్రద్ధలతో పూజించడం వల్ల ఆయన అనుగ్రహం కలుగుతుంది. మరి శనివారం రోజు హనుమంతుడిని ఎలా పూజించాలి అన్న విషయానికి వస్తే.. హనుమంతుడు ఆశీర్వాదం పొందడం కోసం శనివారం రోజున హనుమాన్ చాలీసా పఠనం చేయాలి.
ప్రతి శనివారం హనుమాన్ చాలీసా పఠనం చేసిన వారికి హనుమంతుడు అన్ని శుభాలను కలిగిస్తాడు.
హిందూ మత విశ్వాసాల ప్రకారం హనుమంతుడి ఆశీర్వాదం పొందడానికి శనివారం సుందరకాండ పఠనం చేయాలి. ఎవరైతే సుందరకాండను పఠనం చేస్తారో వారిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుందని, సమస్యల నుండి ఉపశమనం లభిస్తుందని చెబుతారు. హనుమంతుని ప్రసన్నం చేసుకోవడానికి శ్రీరాముని స్మరించటం చాలా సులభమైన మార్గం అని చెప్పవచ్చు. హనుమంతుని ప్రసన్నం చేసుకోవాలనుకునే వారు శనివారం నాడు జపం చేస్తే మంచిది. అంతేకాకుండా శనివారం నాడు ఇష్టమైన పరిమళాన్ని, చందనాన్ని హనుమాన్ కు సమర్పిస్తే ఆయన సంతోషిస్తాడు.
శనివారం నాడు హనుమంతుని ముందు చతుర్ముఖ దీపాన్ని వెలిగించడం వల్ల ఇంటికి, కుటుంబానికి సంబంధించిన సమస్యలన్నీ తొలగిపోతాయని చెబుతున్నారు. అలాగే ఏడున్నర యేళ్ళ శనిదోషం ఉన్నవారు శనివారం ఆంజనేయ ఉపాశన చేస్తే వారికి మంచి కలిగి, శని దోషం తగ్గుతుంది. శనివారం నాడు ఈ పనులు చెయ్యటం వలన హనుమాన్ ను పూజించటం వలన భయాలు, బాధలు, అనారోగ్యాలు, ఆర్ధికపరమైన ఇబ్బందులు తొలగిపోతాయని అంటున్నారు. గ్రహ సంబంధమైన దోషాలు కూడా తొలగిపోతాయి.