Nagapanchami: శ్రావణమాసంలో మనం ఎన్నో రకాల పండుగలు నోములు, వ్రతాలను చేసుకుంటూ ఉంటాము. ఇక శ్రావణమాసంలో ముందుగా వచ్చే పండుగలలో నాగ పంచమి ఒకటి. నాగ పంచమి రోజు ప్రత్యేకంగా నాగదేవతలను పూజిస్తూ ఉంటారు. ఇక నాకు పంచమి రోజు నాగ దేవతకు ప్రత్యేక పూజలు చేయడం వల్ల ఏ విధమైనటువంటి కాలసర్ప దోషాలు ఉన్న తొలగిపోతాయని భావిస్తూ ఉంటారు. అయితే పితృ దోషంతో బాధపడేవారు సైతం నాగ పంచమి రోజు ఇలా చేస్తే పితృ దోషాలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు. మరి నాగ పంచమి రోజు ఎలాంటి పరిహారాలు చేయాలి ఏంటి అనే విషయానికి వస్తే..
మన జాతకంలో కాలసర్పదోషం పితృ దోషం ఉంటే కనుక జీవితంలో ఎన్నో సమస్యలు ఎదురవుతాయి మనం చేసే ఏ పనులు కూడా విజయవంతం కావు. పితృ దోషంతో బాధపడేవారు నాగ పంచమి రోజున శ్రీ సర్ప సూక్తాన్ని పఠించాలి. ఇది మహా శక్తివంతమైన మంత్రంగా పరిగణిస్తారు.నాగ పంచమి రోజున శ్రీమద్ భగవద్ పురాణం, శ్రీ హరివంశ పురాణాన్ని తప్పనిసరిగా పఠించాలి. ఇలా చేయడం వల్ల పితృదోషం నుంచి ఉపశమనం లభిస్తుంది.
ఇక నాగ పంచమి రోజు శివుడికి చందనం సమర్పించి ఆ చందనం మన నుదుటిపై తిలకంలా దిద్దుకోవాలి. అంతేకాదు ఉదయం, సాయంత్రం ఇంట్లో కర్పూరాన్ని వెలిగించండి. ఇలా చేయడం వలన పితృ దోషం తొలగిపోతుంది.నాగ పంచమి రోజున ఏదైనా శివాలయానికి లేదా ఇతర ఆలయానికి వెండితో చేసిన సర్పాన్ని దానం చేయడం శ్రేయస్కరం. ఇలా చేయడం వల్ల ఆర్థిక ఇబ్బంది తీరి లాభాల బాట పట్టే అవకాశం ఉంది. అలాగే నాగ పంచమి రోజు నాగదేవతల విగ్రహాలకు పాలు పోసి పూజించడం వల్ల ఈ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి.