Tulasi plant: మన హిందూ సాంప్రదాయాల ప్రకారం తులసి మొక్కకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ప్రతి ఇంటి ఆవరణంలో తులసి మొక్కను ఏర్పాటు చేసుకొని ప్రతిరోజు ఉదయం సాయంత్రం పూజిస్తూ ఉంటారు. తులసి మొక్కను సాక్షాత్తు లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు కనుక పెద్ద ఎత్తున పూజలు నిర్వహిస్తూ ఉంటారు. ఇలా తులసి మొక్కను పూజించడం వల్ల లక్ష్మీదేవి కరుణ కటాక్షాలు మనపై ఉంటాయని ఏ విధమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉంటాయని పండితులు చెబుతుంటారు.
ఇక మన ఇంటి ఆవరణంలో తులసి మొక్కను ఏర్పాటు చేశాము అంటే తప్పనిసరిగా కొన్ని నియమాలను కూడా పాటించాలి. సరైన దిశలోనే తులసి మొక్కను నాటడం అలాగే పూజ చేసే విషయంలో కూడా కొన్ని నియమాలను పాటిస్తూ పూజ చేసినప్పుడే మంచి ఫలితాలు ఉంటాయి. ఇకపోతే తులసి మొక్కను పొరపాటున కూడా రెండు రోజులు అసలు తాకకూడదని పండితులు చెబుతున్నారు.
ఈ రెండు రోజులలో తులసి మొక్కను గనుక తాకినట్లయితే అమ్మ వారి ఆగ్రహానికి గురి కావడమే కాకుండా అప్పులలో కూరుకుపోవాల్సి వస్తుందట. మరి ఆ రెండు రోజులు ఏంటనే విషయాన్నికి వస్తే ఒకటి ఏకాదశి రెండు ఆదివారం. ఈ రెండు రోజుల పొరపాటున కూడా తులసి మొక్కను తాకకూడదు. ఈ రెండు రోజులలో విష్ణుమూర్తి కోసం లక్ష్మీదేవి ఉపవాసం ఉంటుంది. కనుక ఈ రెండు రోజులలో తులసిని తాగకూడదు అలాగే నీరును కూడా పోయకూడదని పండితులు చెబుతున్నారు. ఈ రెండు రోజుల్లో తులసి మొక్కను తాగితే పెద్ద ఎత్తున అప్పులు బాధలను ఎదుర్కోవలసి వస్తుంది.