Tulasi plant: మన హిందూ సాంప్రదాయాల ప్రకారం తులసి మొక్కను సాక్షాత్తు లక్ష్మీ స్వరూపంగా భావిస్తాము అందుకే ప్రతి ఒక్క ఇంటి ఆవరణంలో మనకు తులసి మొక్క దర్శనం ఇస్తుంది. తులసి మొక్కను సాక్షాత్తు లక్ష్మీ స్వరూపంగా భావించడం వల్ల ప్రతిరోజు ఉదయం సాయంత్రం తులసి కోటకు ప్రత్యేకంగా పూజలు చేసి తులసిదేవిని నమస్కరిస్తూ ఉంటాము. అయితే తులసి మొక్కకు పూజ చేసేటప్పుడు ప్రతి ఒక్కరూ కూడా నీరు పోసి పూజిస్తూ ఉంటారు అయితే ఈ నీరు పోసే విషయంలో కూడా చాలా జాగ్రత్తలను పాటించాలని పండితులు చెబుతున్నారు.
తులసి మొక్కకు మనం ఇష్టానుసారంగా నీళ్లను పోసి పూజించడం వల్ల విష్ణుమూర్తి లక్ష్మీదేవి ఆగ్రహానికి గురి కావాల్సి ఉంటుంది. అందుకే తులసి మొక్కకు నీరు పోసే సమయంలో తప్పనిసరిగా కొన్ని నియమాలను పాటించాలని పండితులు చెబుతున్నారు. మరి ఆ నియమాలు ఏంటి అనే విషయానికి వస్తే.. తులసి మొక్కకు ప్రతిరోజు ఉదయం నీళ్లు పోసేటప్పుడు తప్పనిసరిగా స్నానం చేసిన తరువాతనే తులసి మొక్కకు నీరు పోయాలి ఇలా పోయడం ఎంతో మంచిది.
ఇక తులసి మొక్క బుధవారం ఆదివారం పొరపాటున కూడా నీళ్లు పోయకూడదు. ఇలా నీళ్లు పోయడం వల్ల లక్ష్మీదేవి ఆగ్రహానికి గురి కావాల్సి ఉంటుంది. ఈ రెండు రోజులు లక్ష్మీదేవి విశ్రాంతి సమయం కనుక నీళ్లను పోయకూడదు. ఈ రెండు రోజులలో లక్ష్మీదేవి విష్ణు దేవుడి కోసం ఉపవాసం ఉంటారు. అలాంటి సమయంలో మనం నీటిని పోయకూడదు. ఇక చాలామంది ఏదైనా బట్టలు చినిగిపోయి ఉంటే కుట్టుకొని వేసుకుని ఉంటారు అలాంటి బట్టలు ధరించినప్పుడు కూడా తులసి మొక్కకు నీళ్లు పోయకూడదు. ఇక భోజనం చేసిన తర్వాత అసలు నీటిని పోయకూడదు. ఇలా తులసి మొక్కకు నీళ్లు పోసే విషయంలో ఈ నాలుగు తప్పులు పొరపాటున కూడా చేయకూడదని ఇలా చేస్తే లక్ష్మీదేవి ఆగ్రహానికి గురి కావాల్సి ఉంటుందని పండితులు చెబుతున్నారు.