Ice cream: వేసవి కాలం వచ్చిందంటే చాలు ప్రతి ఒక్కరు కూడా చల్ల చల్లని పానీయాలు ఐస్ క్రీములు తినాలని కోరిక ప్రతి ఒక్కరికి కలుగుతుంది. అయితే చాలామంది ఐస్క్రీమ్ తినడానికే ఇష్టపడుతూ ఉంటారు. చిన్నపిల్లల నుంచి మొదలుకొని పెద్దవారి వరకు కూడా ఐస్ క్రీమ్ తినడానికి ఆసక్తి చూపుతూ ఉంటారు. అయితే ఐస్ క్రీమ్ తిన్న తర్వాత చాలామంది తెలిసి తెలియక కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు.
ముఖ్యంగా ఐస్ క్రీమ్ తిన్న తర్వాత కొన్ని పదార్థాలను అసలు తినకూడదు. మరి ఏ ఏ పదార్థాలను ఐస్ క్రీమ్ తిన్న తర్వాత తినకూడదు అనే విషయానికి వస్తే.. ఐస్ క్రీమ్ తిన్న వెంటనే వేడి పానీయాలు తాగడం మంచిది కాదు అంటే టీ కాఫీ వంటి వాటిని తాగకూడదు వీటిని తాగటం వల్ల కడుపునొప్పి సమస్యలతో బాధపడే అవకాశాలు అధికంగా ఉంటాయి.
ఐస్ క్రీమ్ తిన్న తర్వాత సిట్రస్ జాతికి చెందినటువంటి పండ్లను అసలు తినకూడదు.సిట్రస్ పండ్లలోని యాసిడ్‌లు మీ పొట్టలోని ఐస్‌క్రీమ్‌తో కలిసి గ్యాస్ , అజీర్ణానికి కారణమవుతాయి. వీటితోపాటు వేయించిన ఆహార పదార్థాలను కూడా తినకపోవడం మంచిది అలాగే ఐస్ క్రీమ్ తిన్న వెంటనే చాక్లెట్ తినటం వల్ల చాక్లెట్‌లో ఉండే కెఫిన్ మీ కడుపులోని ఐస్‌క్రీమ్‌తో కలిసి కడుపు నొప్పిని కలిగిస్తుంది. అలాగే మద్యం కూడా తాగకూడదు మద్యం తాగటం వల్ల వాంతులు విరోచనాలు అయ్యే అవకాశాలు అధికంగా ఉన్నాయి.