Phone: ఇటీవల కాలంలో మొబైల్ ఫోన్ వాడకం చాలా ఎక్కువగా ఉంది. చిన్నపిల్లల నుంచి మొదలుకొని పండు ముసలి వారి వరకు కూడా ఈ మొబైల్ ఫోన్ అనేది విరివిగా ఉపయోగిస్తున్నారు. అన్నం లేకుండా ఒక పూట ఆయన బ్రతుకుతున్నారు కానీ మొబైల్ ఫోన్ లేకుండా ఒక గంట కూడా కనిపించడం లేదు. ఇలా సెల్ ఫోన్ కి పూర్తిగా బానిసలుగా మారిపోయారు. ఈ విధంగా మొబైల్ ఫోన్లో ఎక్కువసేపు కాలక్షేపం చేయటం వల్ల మనకు సరదాగా ఉంటుంది. కానీ రాను రాను పెద్ద ఎత్తున ప్రమాదాలను ఎదుర్కోవలసి వస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
మొబైల్ ఫోన్ అధికంగా వాడటం వల్ల ఎన్నో రకాల అనారోగ్య సమస్యలను కొని తెచ్చుకున్నట్టే మొబైల్ ఫోన్ చేతిలో పట్టుకొని తరచూ దానినే చూస్తూ ఉండటం వల్ల మెడ నొప్పితో పాటు భుజం నొప్పి కూడా ఎక్కువగా ఉంటుంది. మొబైల్ ఫోన్ నుంచి వెలువడే లైటింగ్ కారణంగా కళ్ళు దెబ్బ తినడమే కాకుండా కంటి చూపు కూడా మందగిస్తుంది.
మొబైల్ ఫోన్ కి బానిసలు కావడం వల్ల ఏ పని చేయాలన్న ఆసక్తి చూపించరు చాలా లేజీగా తయారవుతారు.
ఇక చేతిలో సెల్ఫోన్ ఉంటే అది మన ఆలోచన శక్తిపై కూడా తీవ్రమైన ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు. ఒకప్పుడు ఏదైనా లెక్క క్యాలిక్యులేట్ చేయాలంటే మనం ఆలోచించే వాళ్ళం కానీ ఇప్పుడు మొబైల్ లో క్యాలిక్యులేటర్ యూస్ చేసి లెక్కలు వేస్తున్నాము ఇలా ఆలోచన శక్తి తగ్గడానికి కూడా కారణం అవుతుంది. తీవ్రమైన తలనొప్పి నిద్ర లేకపోవడం అలసట వంటి సమస్యలు కూడా వెంటాడుతాయి. ఇక సెల్ ఫోన్ పై ఉన్న బ్యాక్టీరియా కారణంగా సెల్ఫోన్ టచ్ చేసి మనం మొహంపై చేతులు పెట్టుకోవడం వల్ల చర్మం కూడా దెబ్బతిని చర్మంపై ముడతలు వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఇలా మొబైల్ ఫోన్ అప్పటికి సరదా కలిగించిన రాబోయే రోజుల్లో ఎన్ని ప్రమాదకరమైన పరిస్థితులను తీసుకువస్తుంది. అందుకే వీలైనంతవరకు సెల్ ఫోన్స్ దూరం పెట్టడం మంచిది.