Tollywood: సోషల్ మీడియా వినియోగం పెరిగిన తర్వాత సినిమా సెలబ్రిటీలకు అభిమానులకు మధ్య దూరం తగ్గింది. గతంలో తమ అభిమాన హీరోల సినిమాలు రిలీజ్ అయ్యేంతవరకు వేచి చూసే అలవాటు ఉండేది. అయితే ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదు. తమ అభిమాన హీరోలకు సంబంధించిన సినిమాల అప్డేట్స్ ఎప్పటికప్పుడు అందిస్తూ ఉండాలని కోరుకుంటున్నారు. అయితే ఒక్కోసారి వీళ్ళ కోరికలు డిమాండ్లుగా మారుతున్నాయి. సోషల్ మీడియాలో నిర్మాతలను, దర్శకులను ట్యాగ్ చేసి మరి వార్నింగ్ లు ఇవ్వడం, అప్డేట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉండడం కనిపిస్తుంది. ఆ మధ్యకాలంలో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు చాలా సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.
సోషల్ మీడియాలో రెగ్యులర్ గా అప్డేట్స్ కావాలంటూ నిర్మాతలను, దర్శకులను టెన్షన్ పెట్టొద్దు అని చెప్పారు. అయితే అభిమానులు మాత్రం పద్ధతి మార్చుకోవడం లేదని చెప్పాలి. తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాకి సంబంధించి అప్డేట్ ఇచ్చేంతవరకు త్రివిక్రమ్ శ్రీనివాస్ అలాగే నిర్మాతలను ట్యాగ్ చేస్తూ పోస్టులు పెడుతూనే ఉన్నారు. ఫైనల్ గా అప్డేట్ వచ్చిన తర్వాత కూడా టైటిల్ అనౌన్స్ చేయాలంటూ కొత్త డిమాండ్ చేస్తున్నారు. అలాగే మేము అడిగినప్పుడల్లా అప్డేట్స్ ఇవ్వాలనే విధంగా వారు కామెంట్స్ చేస్తూ ఉండడం ఆసక్తికరంగా మారింది.
ప్రభాస్ ఆది పురుష్ సినిమా రిలీజ్ విషయంలో కూడా దర్శకుడు ఓం రౌత్ విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. సినిమా అప్డేట్ ఇవ్వాలంటూ డిమాండ్లు చేస్తున్నారు. ఇవన్నీ కూడా నిర్మాతలకు ఒకింత అసహనాన్ని గురి చేస్తున్నాయనే మాట వినిపిస్తుంది. అలాగే దర్శకులను కూడా కాస్త ఆందోళన గురి చేస్తుందని సినీ విశ్లేషకులు చెప్తున్నారు. ఈ విషయంలో స్టార్ హీరోల అభిమానులు కచ్చితంగా తమ పద్ధతి మార్చుకోవాల్సిందే అంటూ సూచిస్తున్నారు. అయితే అభిమానులు మాత్రం తగ్గేది లే అంటూ సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు రచ్చ లేపుతున్నారు.
Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ! అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో లేటెస్ట్ న్యూస్…
Allu Arjun: మన శంకరవరప్రసాద్‌గారు సంక్రాంతి బాస్ బస్టర్..అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన…
Tollywood: టాలీవుడ్‌లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…
MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…
Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…
Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…
This website uses cookies.