Hanuman: ఎన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో కేక్ నిరంజన్ రెడ్డి నిర్మాణంలో తేజ సజ్జ హీరోగా నటించిన తాజా చిత్రం హనుమాన్. ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి షో నుంచి కూడా అద్భుతమైనటువంటి ఆదరణ సొంతం చేసుకున్నటువంటి ఈ సినిమా ప్రస్తుతం థియేటర్లలో ప్రేక్షకులను భారీగా సందడి చేస్తుందని చెప్పాలి. ఈ సినిమా సక్సెస్ చూసి సినీ ప్రముఖులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
అత్యంత తక్కువ బడ్జెట్ తో భారీ సక్సెస్ అందుకున్నటువంటి ఈ సినిమా ప్రేక్షకులను ఎంతో మంచిగా ఆకట్టుకోవడమే కాకుండా డైరెక్టర్ ప్రశాంత్ వర్మ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ సినిమా సక్సెస్ అవ్వడానికి గల కారణాలు ఏంటి అనే విషయానికి వస్తే.. డైరెక్టర్ ప్రశాంత్ వర్మ సూపర్ హీరో కథ అయినప్పటికీ దీనిని ఆంజనేయ స్వామి భక్తితో మిళితం చేసిన విధానం ఆకట్టుకుంటుంది. ఇక ఈ సినిమా కథ నెమ్మదిగా ప్రారంభమైనప్పటికీ ఇంటర్వెల్ అలాగే క్లైమాక్స్ కి వెళ్లేసరికి అందరినీ ఆకట్టుకునేలా ఉంది.
ఇక చివరిలో ఆంజనేయ స్వామి షాట్స్ అయితే థియేటర్స్ లో భక్తిని నింపడమే కాదు గూస్ బంప్స్ వచ్చేలా చేస్తున్నాయి. 50 కోట్ల బడ్జెట్ తో డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తనలో ఉన్నటువంటి నైపుణ్యం బయటపెట్టి ఒక అద్భుతమైనటువంటి కథను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. ఇక ఇందులో హీరో తేజ కూడా ఎంతో ఒదిగిపోయి నటించారు. మొత్తానికి అత్యంత తక్కువ బడ్జెట్ తో భారీ హిట్ ఎలా అందుకోవాలి అనే విషయాలన్నింటినీ ప్రశాంత్ వర్మ ఎంతో అద్భుతంగా ప్రేక్షకులకు చూపించారనే చెప్పాలి. అయితే ఈ సినిమాకు సీక్వెల్ కూడా ఉండబోతుందని చివరిలో బాహుబలి రేంజ్ లో క్లైమాక్స్ ఇవ్వటం విశేషం.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్‌గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.