Hanuman Ott: డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జ హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి తాజా చిత్రం హనుమాన్ ఇదివరకే వీరిద్దరి కాంబినేషన్ లో జాంబిరెడ్డి సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ప్రస్తుతం థియేటర్లలో ప్రేక్షకులను సందడి చేస్తున్నటువంటి హనుమాన్ సినిమా నేడు విడుదల అయ్యి మొదటి షో నుంచి ఎంతో అద్భుతమైనటువంటి విజయాన్ని సొంతం చేసుకుని దూసుకుపోతుంది. అత్యంత తక్కువ బడ్జెట్ తో ఒక విజువల్ వండర్ ను ప్రశాంత్ వర్మ ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారని చెప్పాలి.
గుంటూరు కారం సినిమాతో పోటీగా విడుదలైనటువంటి ఈ సినిమా ఎంతో మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమా థియేటర్లలో పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేస్తుంది. పాన్ ఇండియా స్థాయిలో విడుదలైనటువంటి ఈ సినిమాకు అన్ని భాషలలో అదే స్థాయిలో ఆదరణ రావడం విశేషం. ఇకపోతే తాజాగా ఈ సినిమా డిజిటల్ రైట్స్ కి సంబంధించినటువంటి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఈ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సమస్థ జీ 5 వారు భారీ ధరలకు కొనుగోలు చేశారు.
ఇక ఈ సినిమా ఎంతో అద్భుతమైనటువంటి విజయాన్ని సొంతం చేసుకోవడంతో ఓటీటీలోకి రావడానికి కాస్త ఆలస్యం అవుతుందని తెలుస్తుంది. బహుశా ఈ సినిమా మార్చి మొదటి వారంలో లేదా రెండవ వారంలో డిజిటల్ స్ట్రీమింగ్ కానుందని తెలుస్తుంది. ఇక ఈ సినిమాకు సీక్వెల్ చిత్రం కూడా ఉండబోతుందని ప్రశాంత్ వర్మ ఈ సినిమా క్లైమాక్స్ లో స్పష్టంగా చూపించారు. ఇక ఈ సినిమా క్లైమాక్స్ లో జై హనుమాన్ అంటూ ఏకంగా బాహుబలి సినిమా రేంజ్ లో క్లైమాక్స్ పూర్తి చేయడం గమనార్హం.
Srinidhi Shetty: కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టికి తెలుగులో ఇప్పటి వరకూ సాలీడ్ దక్కలేదు. కన్నడలో ఆమె నటించిన కేజీఎఫ్…
Tollywood: నేచురల్ స్టార్ నాని నటించబోతున్న లేటెస్ట్ మూవీ బ్లడీ రోమియో. సుజీత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రస్తుతం,…
Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…
Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…
Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…
Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…
This website uses cookies.