Health Tips: మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే ఎన్నో పోషకాహారాలు కలిగినటువంటి ఆహారాన్ని తీసుకోవడం ఎంతో ముఖ్యం. అయితే చాలామంది ఈ మధ్యకాలంలో అధిక శరీర బరువు ఉన్నారన్న కారణముతో రాత్రిపూట భోజనం చేయడం మానేస్తున్నారు. ఇలా రాత్రిపూట భోజనం చేయకపోతే శరీర బరువు తగ్గుతారన్న కారణంతో రాత్రి సమయంలో భోజనం చేయడం లేదు మరి నిజంగానే రాత్రి భోజనం చేయకపోతే బరువు తగ్గుతారా ఇలా చేయకపోవడం వల్ల ఏ విధమైనటువంటి అనారోగ్య సమస్యలు వస్తాయి అనే విషయానికి వస్తే…
శరీర బరువు తగ్గాలన్న ఉద్దేశంతో రాత్రిపూట భోజనం చేయకుండా ఉంటే కనుక తప్పనిసరిగా మీరు ప్రమాదంలో పడినట్లేనని నిపుణులు చెబుతున్నారు. రాత్రిపూట భోజనం చేయకపోవడం వల్ల ఉదయం వరకు మన కడుపు ఖాళీగానే ఉంటుంది. తద్వారా మన శరీరంలో ఎన్నో రకాల మార్పులు జరుగుతాయి ముఖ్యంగా రక్తంలో చక్కెర స్థాయిలలో మార్పులు చోటు చేసుకోవడం జరుగుతుంది. అలాగే రక్తప్రసరణ రేటు పై కూడా ప్రభావం చూపడంతో గుండెపోటు సమస్యలు కూడా వచ్చే అవకాశాలు చాలా ఉంటాయి.
రాత్రిపూట భోజనం చేయకపోవడం వల్ల మన శరీరంలో శక్తిని తగ్గించి ఒత్తిడిని పెంచుతుంది. అలాగే సరైన నిద్ర కూడా పట్టదని నిపుణులు చెబుతున్నారు. అందుకే రాత్రిపూట తప్పనిసరిగా భోజనం చేయడం ఎంతో ముఖ్యం అయితే బరువు తగ్గాలి అనుకున్న వారు అధిక పరిమాణంలో భోజనం చేయకుండా కాస్త తక్కువ పరిమాణంలో అది కూడా నిద్రపోవడానికి రెండు గంటల ముందు భోజనం చేసి నిద్రపోవడం ఎంతో మంచిది. వీలైనంతవరకు రాత్రి 7 గంటలలోపు భోజనం చేయడం ఆరోగ్యానికి ఎంతో మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఇలా భోజనం చేయడం వల్ల ఆరోగ్యం పెంపొందించుకోవడమే కాకుండా బరువు కూడా తగ్గుతారు అంతేకానీ రాత్రిపూట భోజనం మానేస్తే ఇతర అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశాలు ఉన్నాయి.