AP Capital: మూడు రాజధానులు అంటూ హడావిడి చేసిన వైసీపీ పార్టీ కొద్ది రోజులుగా ఏపీ రాజధాని విశాఖపట్నం అంటూ పెట్టుబడీదారుల సదస్సులో అందరి దృష్టికి తీసుకొని వెళ్తుంది. ప్రజలకి చెప్పేది ఒక మాట అయితే పారిశ్రామిక వేత్తలకి మాత్రం ఏపీ రాజధాని విశాఖ మాత్రమే అని చెబుతున్నారు. ఇక అక్కడ మీటింగ్ లో చెప్పిన వెంటనే మరల ఏపీలో ప్రతిపక్షాలు విమర్శలు చేయడం మొదలు పెడతాయని వెంటనే సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా ముందుకి వచ్చి మా విధానం మూడు రాజదానులే. అందులో ఎలాంటి సందేహం లేదు అంటూ అదే పల్లవి అందుకోవడం చేస్తున్నారు. ఢిల్లీలో ముఖ్యమంత్రి జగన్ ఏపీకి రాజధానిగా విశాఖ ఉండబోతుంది అని చెప్పారు. అక్కడికి తాను షిఫ్ట్ అవుతున్నా అని, మీరు కూడా వచ్చి పెట్టుబడులు పెట్టాలని కోరారు.
అది జరిగిన తర్వాత విపక్షాలు విమర్శలు మొదలు పెట్టాయి. ఇక సజ్జల రామకృష్ణా రెడ్డితో పాటు మరికొంత మంది మంత్రులు మీడియా ముందుకి వచ్చారు. మూడు రాజధానులకి వైసీపీ కట్టుబడి ఉందని చెప్పారు. ఇక తాజాగా బెంగుళూరులో జరిగిన సమ్మిట్ లో ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఏపీకి ఒకటే రాజధాని అని అది విశాఖపట్నం మాత్రమే అని పేర్కొన్నారు. మూడు రాజధానులు అనేది మిస్ కమ్యూనికేషన్ తో ప్రచారంలోకి వచ్చింది అంటూ పేర్కొన్నారు. అమరావతిలో ఒక అసెంబ్లీ సెషన్స్ జరుగుతాయి. అలాగే కర్నూల్ లో హైకోర్టు బెంచ్ ఏర్పాటు జరుగుతుంది అని చెప్పారు. ఇక దీనిపై తెలుగుదేశం పార్టీ విమర్శలు మొదలు పెట్టింది. దీంతో సజ్జల యదావిధిగా మీడియా ముందుకి వచ్చి బుగ్గన వ్యాఖ్యల ప్రభావం తగ్గించే ప్రయత్నం చేశారు.
వైసీపీ లక్ష్యం మూడు రాజధానులు అంటూ చెప్పారు. అలాగే మంత్రి అంబటి రాంబాబు కూడా మూడు రాజధానులకి వైసీపీ కట్టుబడి ఉందని పేర్కొన్నారు. అలాగే మరికొంత మంది మంత్రులు కూడా మీడియా ముందుకి వచ్చి మూడు రాజధానులు వైసీపీ అజెండా అని, ఇందులో ఎలాంటి మార్పు లేదని సమర్ధించారు. అయితే వారు చేసిన కామెంట్స్ లో మరి బుగ్గన రాజేంద్రనాథ్ చేసిన వ్యాఖ్యపై క్లారిటీ మాత్రం ఇచ్చే ప్రయత్నం మాత్రం చేయలేదు. దీంతో వైసీపీ మంత్రులు, నాయకుల తీరు ఒక్కొక్కరిది ఒక్కోలా ఉందని టీడీపీ నేతలు విమర్శలు స్టార్ట్ చేశారు.
రాజధానులపై ఎవరి అభిప్రాయం కూడా కరెక్ట్ గా లేదని, ఎవరికి నచ్చింది వారు చెబుతున్నారు అంటూ యనమల రామకృష్ణుడు విమర్శలు చేశారు. మరో వైపు జనసేన నాయకుడు నాదెండ్ల మనోహర్ కూడా విశాఖ రాజధానిగా ఉండాలని అక్కడి వారే కోరుకోవడం లేదని పేర్కొన్నారు. అలాగే రాజధాని మార్పుపై వైసీపీ డ్రామాలు ఆడుతుందని విమర్శించారు.
Pawan Kalyan:హైదరాబాద్‌లో ఉస్తాద్ భగత్‌సింగ్ ప్రీరిలీజ్ ఈవెంట్..ఏ డేట్ లాకైందో తెలుసా? అంటూ ఇప్పుడు ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి…
Ram Charan: మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న పాన్ ఇండియా సినిమా 'పెద్ది' నుంచి అప్‌డేట్స్ రావడం లేదని…
Mega 158: మెగాస్టార్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ మెగా 158 వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతోంది. గతంలో చిరుకి వాల్తేరు వీరయ్య…
Puranapanda Srinivas: తిరుమల క్షేత్రమే తరలి వచ్చినట్లుగా వేల కొలది భక్తుల ఆనందోత్సాహాల మధ్య హైదరాబాద్ జూబిలీహిల్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి…
Kalki 2898 AD Sequel:సైలెంట్‌గా కల్కి సీక్వెల్ షూట్..సెట్స్‌లో అమితాబ్, ప్రభాస్! అవును..ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్…
Puranapanda Srinivas: దైవబలం ఎలా ఉంటుందో మన కన్నుల ముందు ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ జీవనంలోని పరీక్షలూ, కటాక్షాలూ…
This website uses cookies.