Guava: జామకాయలు మన ఆరోగ్యాన్ని రక్షించే ఔషధ గుణాలతో పాటు పోషక విలువలు సమృద్ధిగా లభిస్తాయి. తరచు జామకాయను ఆహారంగా తీసుకుంటే మన శరీరానికి అవసరమైన యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సి, ఏ, ఫైబర్ ,ప్రొటీన్లు, మెగ్నీషియం, పొటాషియం, కార్బోహైడ్రేట్లు పుష్కలంగా లభించడంతోపాటు మన శరీరంలో ఇన్ఫెక్షన్ కలిగించే అనేక వ్యాధికారక సూక్ష్మజీవులను నశింపజేయడంలో ముఖ్యపాత్ర పోషించి మనలో వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తుంది.
జామకాయను తినే విషయంలో కొందరికి కొన్ని ఆపోహాలు ఉన్నాయి. మన ఆరోగ్యానికి తెల్లని గుజ్జు గల జామపండు మంచిదా. ఎర్రని గుజ్జు గల జామపండు మంచిదా అనే సందేహాలు ఉన్నాయి. నిజానికి జామ పనులలో చాలా రకాలు ఉన్నప్పటికీ మనకు తెలుపు రంగు జామ పండ్లు, ఎరుపు రంగు జామ పండ్ల ఎక్కువగా కనిపిస్తుంటాయి. వాస్తవానికి రెండు రకాల జామపంలలోనూ ఒకే విధమైన ఔషధ గుణాలు పోషకపదార్థాలు లభిస్తాయి. వీటి మధ్య తేడా రంగు, రుచి , వాసన మాత్రమే అని చెప్పొచ్చు.
ఎరుపు రంగు జామ పండ్లలో కెరోటెనాయిడ్ అనే పదార్థం ఉంటుంది. అందువల్లే వీటిగుజ్జు పింకు లేదా ఎరుపు రంగులో ఉంటుంది. తెలుపు రంగు జామ పండు కంటే ఎరువు రంగు జామలో నీరు ఎక్కువగా ఉండి తీపి, గింజలు, కార్బోహైడ్రేట్స్ తక్కువగానే ఉంటాయి. తెల్లని గుజ్జు గల జామలో నీటి శాతం తక్కువ తీపి, గింజలు, కార్బోహైడ్రేట్స్, విటమిన్ సి ఎక్కువగానే ఉంటాయి.
జామ పండు ఏ రంగులో ఉన్న మన ఆరోగ్యాన్ని రక్షించడంలో మాత్రం చక్కగా ఉపయోగపడుతుంది. తరచూ జామ పండ్లను తింటే ఒత్తిడి, నీరసం వంటి సమస్యలు తొలగిపోతాయి. జీర్ణ వ్యవస్థ మెరుగుపడి మలబద్ధక సమస్య జరుగుతుంది. కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో సహాయపడి అతిబరువు సమస్యను దూరం చేస్తుంది. డయాబెటిస్ వ్యాధిని నియంత్రణలో ఉంచుతుంది. డయాబెటిస్ వ్యాధితో బాధపడే వారు మాత్రం తక్కువ తీపి, కార్బోహైడ్రేట్స్ ఉన్న ఎరుగురంగు గుజ్జు జామ పండ్లను ఆహారంగా తీసుకోవడం మంచిది.