Wed. Jan 21st, 2026

    Prabhas : కొన్నిగంటల క్రితం పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ విదేశాలకి వెళ్ళిన పిక్స్ నెట్టింట తెగ వైరల్ అయ్యాయి. ఆయన ఆరోగ్యం బాగోలేకనే చికిత్స కోసం ఇలా ఉన్నపలంగా ప్రభాస్ విదేశాలకి బయలుదేరారని టాక్ వినిపించింది. కానీ, అది నిజం కాదని తాజా సమాచారం. ప్రస్తుతం డార్లింగ్ వరుస సినిమాలతో చాలా బిజీగా ఉన్నారు. అన్నీ పాన్ ఇండియన్ రేంజ్‌లో రూపొందుతున్న సినిమాలే.

    ఆదిపురుష్ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్‌లో ఉంది. ఈ సినిమాలో రాముడిగా కనిపించబోతున్నారు. దీని తర్వాత సలార్ అనే భారీ యాక్షన్ సినిమాతో రాబోతున్నారు ప్రభాస్. కేజీఎఫ్ సిరీస్‌తో భారీ సక్సెస్‌లు అందుకున్న ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో హై ఓల్టేజ్ యాక్షన్ సినిమాగా తెరకెక్కుతోంది. శృతి హాసన్ ఇందులో ప్రభాస్‌కి జంటగా కనిపిస్తోంది. ఇప్పటికే చాలా వరకూ చిత్రీకరణను పూర్తి చేసుకున్న సలార్ ప్రస్తుతం ఇటలీ భారీ యాక్షన్ సీక్వెన్స్‌ను తెరకెక్కిస్తున్నారు.

     

    Did Prabhas go abroad for surgery? Clarity has come.
    Did Prabhas go abroad for surgery? Clarity has come.

    ఈ సినిమా షూటింగ్ కోసమే ప్రభాస్ ఇటీవల ఇటలీకి బయలుదేరారు. కానీ, ఎయిర్‌పోర్ట్‌లో ఆయనను చూసిన జనాలు మాత్రం ప్రభాస్ అనారోగ్యం బారిన పడటంతో చికిత్స కోసం విదేశాలకి వెళుతున్నారని ప్రచారం చేశారు. వాస్తవంగా అయితే సలార్ సినిమా చిత్రీకరణలో పాల్గొనేందుకే ఆయన ఫ్లైటెక్కారని అర్థమవుతోంది. ఇలాంటి రూమర్స్ సినీ తారలపై రావడం సర్వసాధారణం. ఇది కూడా అలాంటిదే అని తేలిపోయింది.

    ఇక ప్రభాస్ నుంచి మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతునున్న సినిమా ఉంది. అలాగే, ప్రాజెక్ట్ కె, సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో స్పిరిట్ ఉన్నాయి. స్పిరిట్ తప్ప మిగిలిన సినిమాలన్నీ సెట్స్ మీద ఉన్నాయి. బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో రావాలనేదే ప్రభాస్ ప్లాన్. ఇవి కాక మరికొన్ని పాన్ ఇండియన్ ప్రాజెక్ట్స్ చర్చల్లో ఉన్నాయని సమాచారం.

    By VSR

    విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.