Diabetes: ప్రస్తుత కాలంలో అందరిని అధికంగా వేధిస్తున్న సమస్యలలో మధుమేహ సమస్య కూడా ఒకటి. శరీరంలో చక్కెర స్థాయి పెరగటం వల్ల ఈ సమస్య తలెత్తుతుంది. అయితే ఈ సమస్య నుండి విముక్తి పొందటానికి వివిధ రకాల మందులు ఉపయోగిస్తూ ఉంటారు. అంతేకాకుండా తీసుకునే ఆహారం విషయంలో కూడా ఎన్నో జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. అయితే మధుమేహ సమస్య నియంత్రించడానికి వేల రూపాయలు ఖర్చు చేసి మందులు ఉపయోగించడమే కాకుండా కొన్ని రకాల పండ్లు తినటం వల్ల మధుమేహ సమస్యను పూర్తిగా నియంత్రించవచ్చు. ఇప్పుడు మనం వాటి గురించి తెలుసుకుందాం.
• నేరేడు పండ్లు : నేరేడు పండ్లు శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తాయి. నేరేడు పండులో ఉండే కొన్ని పోషకాలు మధుమేహ సమస్యను నివారించడంలో దోహదపడతాయి. నేరేడు పండ్లు తినడమే కాకుండా ఈ పండ్ల విత్తనాలతో తయారు చేసిన పొడిని టీలో కలుపుకుని తాగడం వల్ల మధుమేహం సులభంగా నియంత్రణలో ఉంటుంది. అంతేకాకుండా దీర్ఘకాలి వ్యాధులు కూడా సులభంగా దూరమవుతాయి.
• జామ పండు : మధుమేహ సమస్య నివారణలో జామ పండు కూడా ముఖ్యపాత్ర పోషిస్తుంది. అయితే బాగా పండిన జామ పండు కాకుండా పచ్చి జామ పండు తినటం వల్ల మధుమేహం నివారణలో ఉంటుంది. అంతేకాకుండా జామపండు ఆకులను బాగా శుభ్రం చేసి ఒక గ్లాసు నీటిలో వేసి ఉడికించి ఆ నీటిని తాగటం వల్ల కూడా మధుమేహం నియంత్రణలో ఉంటుంది.
Diabetes:
• అంజీర్ ఆకులు: మధుమేహ నివారణలో అంజీర్ ఆకులు కూడా ప్రభావవంతంగా సహాయపడతాయి. ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో అంజీర్ ఆకులను నమిలి తింటే మధుమేహ సమస్య నియంత్రణలో ఉంటుంది.
• మెంతులు : తీవ్ర మధుమేహం సమస్యలతో బాధపడేవారు ప్రతిరోజు కొన్ని మెంతి గింజలను తీసుకోవటం వల్ల మధుమేహం నివారణలో ఉంటుంది. అంతేకాకుండా కొలెస్ట్రాల్ పరిమాణాలను కూడా నియంత్రిస్తుంది.