Tulasi pooja: ప్రస్తుతం నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాలలో ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడుతుంది. ఒకవైపు తెలంగాణలో బతుకమ్మ వేడుకలను తొమ్మిది రోజులపాటు ఎంతో ఘనంగా నిర్వహిస్తూ తెలంగాణ ప్రజలందరూ కూడా భక్తి భావంలో మునిగి తేలుతూ ఉన్నారు. మరొకవైపు ఆంధ్రలో దేవి నవరాత్రులను ఎంతో ఘనంగా నిర్వహిస్తూ ఉన్నారు. ఇలా దసరా పండుగ అంటేనే కన్నుల పండుగగా జరుగుతుందనే విషయం మనకు తెలిసిందే. ఇక దేవి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా అమ్మవారిని ప్రతిరోజు ఒక అలంకరణలో తయారుచేసి అమ్మవారికి వివిధ రకాల నైవేద్యాలను సమర్పిస్తూ ఉంటాము.
ఇలా నవరాత్రి ఉత్సవాలు సందర్భంగా పెద్ద ఎత్తున ప్రతి ఒక్కరు కూడా వివిధ రకాల పూజలు వ్రతాలను చేస్తూ ఉంటారు. ఇకపోతే దేవి నవరాత్రులలో భాగంగా మనకు అదృష్టం కలిసి రావాలి అంటే తులసి కోటకు ఇలా పూజ చేస్తే చాలు అని పండితులు చెబుతున్నారు. మరి దేవీ నవరాత్రులలో భాగంగా తులసి కోటకు ఎలా పూజ చేయాలి అనే విషయానికి వస్తే.. తులసి మొక్కకు హిందూ మతంలో చాలా ప్రాధాన్యత ఉంటుంది. ప్రతి ఇంట్లో తులసి మొక్క ఉండడం వలన సానుకూల శక్తి ఇంట్లోకి ప్రవేశిస్తుంది.
ఇక నవరాత్రుల సమయంలో మీ ఇంట్లో తులసి మొక్కకు ఈ పరిహారాలను, పూజలను చేయడం వలన ఇల్లు సంపదలతో నిండిపోతుంది. నవరాత్రులలో గురువారంనాడు తులసి మొక్కకు పచ్చిపాలను సమర్పించడం మంచిది. ఇది లక్ష్మీదేవిని సంతోషపరుస్తుంది. ఇలా ప్రతి గురువారం తులసి మొక్కకు పచ్చిపాలను సమర్పించాలి. నవరాత్రులలో వచ్చే గురువారం లో కూడా ఇలా చేయడం వల్ల మనకు లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. తద్వారా ఏ విధమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా కుటుంబం మొత్తం ఎంతో సంతోషంగా ఆర్థికంగా కూడా ఉన్నత స్థానంలో ఉంటారు.