Devotional Tips: మన హిందూ సంప్రదాయంలో పూజా విధానానికి చాలా ప్రాముఖ్యత ఉంది. అందువల్ల ప్రజలందరూ ప్రతిరోజు ఇంట్లో దేవాలయాలలో పూజలు చేస్తూ ఉంటారు. అయితే హిందూ మతంలో శాలిగ్రామానికి చాలా విశిష్టత ఉంది. మన హిందూ పురాణాలలో శాలిగ్రామాన్ని విష్ణుమూర్తి స్వరూపంగా భావిస్తారు. పురాణాల ప్రకారం శివుడు వెళ్ళినప్పుడు ఆయన పాదాల క్రింద వచ్చిన గులకరాలు అన్న శాలిగ్రామంగా మారుతాయని నమ్మకం. ఇలా మొత్తం 33 రకాల శాలిగ్రామాలు ఉన్నాయి. వీటిలో 24 రకాల శాలిగ్రామాలు విష్ణువుకు సంబంధించినవి. 24 అవతారాల నుండి వచ్చినవని ప్రజల నమ్మకం.
ఎంతో విశిష్టత కలిగిన ఈ శాలిగ్రామాలను ఇంట్లో ఉంచి పూజించటం వల్ల సత్ఫలితాలు కలుగుతాయని నిపుణులు సూచిస్తున్నారు. అయితే ఇంట్లో శాలిగ్రామం పూజించాలి అనుకునేవారు కొన్ని నియమాలు తప్పనిసరిగా పాటించాలి. ఇప్పుడు మనం ఆ నియమాల గురించి తెలుసుకుందాం.
శాలిగ్రామాన్ని పూజించే సమయంలో పాటించవలసిన నియమాలు :
• ప్రవర్తనను స్వచ్ఛంగా ఉండాలి:
శాలిగ్రామం పూజించే సమయంలో మన ప్రవర్తన ఆలోచనలు స్వచ్ఛంగా ఉండాలి. ఆలోచనలు, ప్రవర్తనలో స్వచ్ఛత కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. మాంసం మద్యం సేవించేవారు పొరపాటున కూడా శాలిగ్రామాన్ని పూజించకూడదు.
• రోజూ పూజించండి:
ఇంట్లో దేవుడి ఫోటోలకు బదులు శాలిగ్రామాన్ని పూజించేవారు ప్రతిరోజు క్రమం తప్పకుండా పూజలు చేయాలి. అత్యవసర సమయంలో వ్యాధుల బారినపడినప్పుడు, ప్రయాణాలు చేసినప్పుడు, రుతుక్రమం సమయం మినహాయించి ప్రతిరోజు శాలిగ్రామాన్ని పూజించాలి.
Devotional Tips:
• ఒక్క శాలిగ్రామం మాత్రమే ఉండాలి:
ఇంట్లో పూజాగదిలో ఒకే శాలిగ్రామం మాత్రమే ఉంచి పూజించాలి. పొరపాటున కూడా ఒక్కటి కంటే ఎక్కువ శాలిగ్రామాలను పూజగదిలో ఉంచరాదు.
• శాలిగ్రామ పూజకు ముందు పంచామృతంతో:
నిత్యదీపారధన సమయంలో శాలిగ్రామానికి ప్రతి రోజూ పంచామృతంతో అభిషేకం చేయించాలి. పూజకు ముందు ప్రతిరోజు నెయ్యి, తేనే,పాలు, చక్కెర, స్వచ్చమైన నీరు తో శాలిగ్రామానికి అభిషేకం చేయాలి.
అలాగే పూజ సమయంలో శాలిగ్రామంపై గంధాన్ని పూయండి. దానిపై తులసి ఆకు సమర్పించాలి.