Wed. Jan 21st, 2026

    Devotional Tips:సాధారణంగా మనం ఏదైనా శుభకార్యాలు చేసే సమయంలో లేదా పూజ సమయంలోను పసుపు కుంకుమలు పొరపాటున చేయి జారి కింద పడిపోవడం జరుగుతుంది.ఈ విధంగా పసుపు కుంకుమలు కనుక చేయజారి కింద పడిపోతే ఏదో ఆ శుభం జరుగుతుందని భావిస్తారు. ఇక వివాహిత మహిళలు తన భర్తకు ఏదైనా ప్రమాదం జరుగుతుందేమోనని ఆందోళన చెందుతుంటారు. ఇలా పసుపు కుంకుమలు కనుక నేలపై పడితే ఆ శుభమని భావిస్తూ ఉంటారు అయితే పసుపు కుంకుమలు నేలపై పడితే ఏ విధమైనటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పండితులు చెబుతున్నారు.

     

    మనం ఏదైనా పూజ చేసిన లేదా శుభకార్యం చేసిన ముత్తైదువులను పిలిచి వారికి పసుపు కుంకుమలను అందిస్తాము అదేవిధంగా శుభకార్యం జరిగేటప్పుడు లేదా ఇతర పూజ సమయాలలో కనుక మన చేతులలో నుంచి కనుక పసుపు కుంకుమలు కింద పడితే సాక్షాత్తు భూదేవి కూడా తనని ఆ కార్యక్రమానికి ఆహ్వానించాలని కోరుకుంటున్నారని అర్థం. అందుకే పసుపు కుంకుమలు నేలపై పడితే ఎవరు కూడా బాధపడాల్సిన పనిలేదని పండితులు చెబుతున్నారు.

    Devotional Tips

    ఇలా పూజ సమయంలోను శుభకార్యాలలోనూ పసుపు కుంకుమలు కనక కింద పడితే సాక్షాత్తు భూదేవి అనుగ్రహం కూడా ఆ కార్యం పై ఉందని ఆమెకు కూడా మనం పసుపు కుంకుమలు ఇచ్చామని భావించాలని పండితులు చెబుతున్నారు. ఇలా పసుపు కుంకుమలు కింద పడటం శుభసంకేతమే తప్ప అశుభానికి సంకేతం కాదు దీనిపై ఎవరు ఆందోళన చెందాల్సిన పనిలేదని పండితులు చెబుతున్నారు