Devotional Tips: మన హిందూ సాంప్రదాయంలో పూజా విధానానికి చాలా విశిష్టత ఉంది. దేవుడికి పూజ చేసే సమయంలో భక్తులు స్వామి వారికి ప్రత్యేకంగా పువ్వులతో అలంకరించి నైవేద్యాలను సమర్పించి భక్తిశ్రద్ధలతో పూజలు చేస్తారు. ఈ విధంగా స్వామి వారిని భక్తి శ్రద్ధలతో పూజించడం వల్ల వారి కరుణ కటాక్షాలు ఎల్లవేళలా మనపై ఉంటాయని ప్రజల నమ్మకం. అయితే స్వామికి పూజ చేసేటప్పుడు తప్పనిసరిగా వివిధ రకాల పుష్పాలతో అలంకరిస్తాము ఇలా అలంకరించడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి స్వామికి పువ్వులు సమర్పించే సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయానికి వస్తే…
పూజలో దేవునికి సమర్పించే పుష్పం ఏదైనా శుచి శుభ్రతతో ఉండేలా చూసుకోవాలి. అంటే పురిటి వారు, మైలవారు, బహిష్టులైన మహిళలు ఆ పుష్పాలను తాకకుండా జాగ్రత్త వహించాలి. ఇలాంటి వారు తాకిన పుష్పాలను దేవుడికి సమర్పించకూడదు. అలాగే చెట్టు నుండి రాలిపోయి భూమిపై పడిన పుష్పాలను దేవుడికి సమర్పించకూడదు. వాసన చూసిన పుష్పాలు, కడిగిన పుష్పాలను కూడా పూజకు వినియోగించకూడదని వేద పండితులు చెబుతున్నారు.
Devotional Tips:
ప్రతిరోజు స్నానమాచరించిన తర్వాత కోసిన పత్ర పుష్పాలను మాత్రమే పూజా కార్యక్రమాలకు ఉపయోగించాలి. అప్పుడే ఆ పూజా ఫలితం లభిస్తుంది.
అయితే కొన్ని దేవుళ్లను పువ్వులతో కొన్ని రకాల పత్రాలతో పూజిస్తారు. మహా శివునికి మారేడు దళాలలు ఎంతో ఇష్టమైనవి. అందువల్ల శివుని పూజలు పువ్వులు లేకపోయినా , మారేడు దళాలు మాత్రం తప్పనిసరిగా ఉండాలి. అలాగే విష్ణు భగవానుడిని పూజించేటప్పుడు ఆయనకు ఇష్టమైన తులసి దళాలు సమర్పించి పూజించాలి. ఈ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకొని స్వామివారికి పువ్వులను సమర్పించే పూజ చేయడం వల్ల స్వామివారి అనుగ్రహం మన పైన ఉంటుంది.