Devotional Tips: మన హిందువులు మన ఆచార సంప్రదాయాలను పద్ధతులను ఎంతగా విశ్వసిస్తారో వాస్తు పరిహారాలను కూడా అంతగానే విశ్వసిస్తారు. ఈ క్రమంలోనే మనకు ఇంట్లో ఏదైనా సమస్యలు ఉన్నప్పుడు కొన్ని వాస్తు పరిహారాలను పాటించడం వల్ల ఆ సమస్యలు దూరమవుతాయని భావిస్తుంటారు. అయితే ప్రతిరోజు ఎంతో కష్టపడి పని చేస్తూ ఉన్నప్పటికీ కొందరికి మాత్రం ఇంట్లో ఏ విధమైనటువంటి మానసిక ప్రశాంతత ఉండదు. ఈ విధంగా మానసిక ప్రశాంతత లేకుండా ఇబ్బంది పడుతున్నటువంటి వారు ఎన్నో రకాల వాస్తు పరిహారాలను పాటిస్తూ ఉంటారు అందులో ఒకటే ఈ ధూపం.
ఎవరైతే ఇంట్లో మానసిక సమస్యలతో బాధపడుతూ ఉంటారో అలాంటివారు ఇంట్లో బిర్యాని ఆకులతో ధూపం వేయటం వల్ల ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది దీంతో ఇంట్లో కుటుంబ సభ్యులకు చాలా మనశ్శాంతిగా ఉండటమే కాకుండా సుఖసంతోషాలతో కూడా ఉంటారు. తరచూ ఇంట్లో ఈ విధమైనటువంటి సమస్యలతో బాధపడేవారు ప్రతి మంగళవారం శుక్రవారం ఇంటిని మొత్తం శుభ్రం చేయాలి. ఇంటిని శుభ్రం చేసిన తర్వాత ఇష్ట దైవారాధన చేసి ఇంట్లో ఈశాన్యం మూలం ఐదు బిర్యాని ఆకులను వేసి ధూపం వెలిగించాలి.
Devotional Tips:
ఈ బిర్యాని ఆకులతో పాటు కొద్దిగా సాంబ్రాణి, రెండు దాల్చిన చెక్క, కర్పూరం వేసి ధూపం వేయాలి. ఇలా ఈ ధూపపు కడాయిని ఈశాన్యం మూలంలో పెట్టడం వల్ల ఆ ధూపం ఇల్లు మొత్తం వ్యాప్తి చెంది ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీని బయటకు పంపేస్తుంది. తద్వారా ఇంట్లో పాజిటివ్ వైబ్రేషన్స్ ఏర్పడటమే కాకుండా ఇంటి సుఖసంతోషాలతో మానసిక ప్రశాంతత కలిగి ఉంటారు. ఈ విధంగా నెగిటివ్ ఎనర్జీ తొలగిపోవడమే కాకుండా కుటుంబ సభ్యుల ఆరోగ్య పరిస్థితి కూడా మెరుగవుతుంది.