Devotional Tips: శ్రావణమాసం హిందువులకు ఎంతో పవిత్రమైన మాసం అని చెప్పాలి. ఈ నెలలో ఎంతోమంది మహిళలు పెద్ద ఎత్తున పూజలు వ్రతాలు నోములు చేస్తూ అమ్మవారిని పూజిస్తూ ఉంటారు.ఇలా శ్రావణమాసం ఏ ఆలయానికి వెళ్లిన పెద్ద ఎత్తున భక్తులు భక్తి పారవశ్యంలో మునిగి తేలుతూ ఉంటారు. ఇలా ఎంతో పవిత్రమైనటువంటి ఈ శ్రావణమాసం లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనదని చెప్పాలి. ఈ నెలలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేయటం వల్ల అమ్మవారి కరుణ కటాక్షాలు మనపై ఉండడమే కాకుండా మనకు ఏ విధమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉంటాయని చెప్పాలి.
ఈ శ్రావణమాసం నెలలో పౌర్ణమి రోజు చంద్రుడు శ్రవణా నక్షత్రంలో సంచరించడం వల్ల ఈ మాసానికి శ్రావణమాసం అని చెప్పబడుతుంది. శ్రీమహావిష్ణువు ధర్మపత్ని అయిన లక్ష్మీదేవి అమ్మవారిని అత్యంత ప్రీతికరమైన మాసం ఈ శ్రావణమాసం. ఇక ఈ శ్రావణ మాసంలో చాలామంది అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి పుష్పాలతో అలంకరణలు చేయడమే కాకుండా ఎంతో ఇష్టమైనటువంటి నైవేద్యాలను కూడా సమర్పిస్తూ ఉంటారు.మరి శ్రావణ మాసంలో మహిళలు ఎక్కువగా ఆరాధించే అమ్మవారికి ఏ విధమైనటువంటి పుష్పాలతో పూజ చేయడం వల్ల అమ్మవారి అనుగ్రహం మనపై ఉంటుంది అనే విషయానికి వస్తే…
Devotional Tips:
శ్రావణమాసంలో లక్ష్మీదేవి అనుగ్రహం మనపై ఉండాలి అంటే శ్రావణమాసంలో తప్పకుండా దేవ గన్నేరు పుష్పాలతో అమ్మవారికి పూజ చేయడం ఎంతో మంచిది.ఈ పుష్పాలు దేవుళ్లకు ఎంతో ప్రీతికరమైనది ముఖ్యంగా లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి ఈ దేవ గన్నేరు పుష్పాలను సమర్పించి పూజ చేయడం వల్ల అమ్మవారి కరుణాకటాక్షాలు మనపై ఉండి ఏ విధమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా సకల సంపదలను కలిగిస్తుంది. ఇక ఈ దేవ గన్నేరు చెట్లు ఎక్కువగా ఆలయంలోనే మనకు కనపడుతూ ఉంటాయి. ఈ పుష్పాలతో పూజ చేయడం వల్ల అమ్మవారి అనుగ్రహం మన పైనే ఉంటుంది.