Devotional Tips: మన హిందువులు పెద్ద ఎత్తున భక్తిశ్రద్ధలతో భగవంతుడిని పూజిస్తూ ఉంటారు. ప్రతిరోజు ఇంట్లో పూజలు చేయటం వల్ల ఆ దేవుడి అనుగ్రహం నిరంతరం మనపై ఉంటుందని ప్రజల నమ్మకం. అలాగే చాలామంది ప్రతి రోజు ఇంట్లో పూజ కార్యక్రమాలను పూర్తిచేసుకుని సమీప ఆలయానికి వెళ్లి స్వామి వారిని నమస్కరించుకుంటూ ఉంటారు. ఇలా చాలామంది భక్తిశ్రద్ధలతో స్వామివారిని పూజిస్తూ ఉంటారు అయితే చాలామంది వివిధ రకాల సమస్యలతో బాధపడుతుంటారు ఇలాంటి సమస్యలతో బాధపడేవారు సాక్షాత్తు కలియుగ దైవంగా భావించే శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ప్రత్యేకంగా పూజించడం వల్ల ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఉండవని పండితులు చెబుతున్నారు.
ముఖ్యంగా ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడేవారు ఏడు శనివారాలు పాటు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భక్తి శ్రద్ధలతో పూజించడం వల్ల వారు ఇబ్బందులు తొలగిపోతాయి.అయితే ఈ ఏడు శనివారాలు ఆవు నెయ్యితో స్వామివారికి దీపారాధన చేయడం ఎంతో మంచిది అయితే ఈ దీపారాధన మట్టి ప్రమిదలో కాకుండా బియ్యపు పిండితో చేసిన ప్రమిదను ఉపయోగించి పూజ చేయడం ఎంతో మంచిది. ప్రతి శనివారం ఉదయమే నిద్ర లేచి ఇంటిని శుభ్రం చేసే తలాంటి స్నానం చేయాలి అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి చిత్రపటాన్ని ప్రత్యేక పువ్వులతోనూ తులసి మాలతోనూ అలంకరించాలి.
Devotional Tips:
ఇక స్వామి వారికి ఈటమైన పండ్లు, ఫలాలు, చెక్కెర పొంగలి,పాయసం, గారెలు పులిహార, కలకండ నైవేద్యంగా సమర్పించాలి. ఆ తర్వాత బియ్యం పిండితో తయారు చేసిన ప్రమిదలో ఆవు నెయ్యి
తో దీపం వెలిగించాలి. పూజా సమయంలో ” ఓం నమో నారాయణాయ” అనే మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో జపిస్తూ వేంకటేశ్వరుడిని ఆరాధించాలి. ఇలా శనివారం పిండి దీపంవెలిగించి వెంకటేశ్వర స్వామికి ప్రత్యేకంగా పూజలు చేయడం వల్ల స్వామివారి కరుణ కటాక్షాలు ఎల్లవేళలా మనపై ఉంటాయి.