Devotional Tips: హిందూ పురాణాల ప్రకారం ఉగాది పండుగ నుండి తెలుగు సంవత్సరం ప్రారంభం అవుతుంది. తెలుగు సంవత్సరం ప్రకారం ఏప్రిల్ ఏడవ తేదీ నుండి వైశాఖమాసం ప్రారంభం అవుతుంది. వైశాఖ మాసానికి ఎంతో విశిష్టత ఉంది. వైశాఖ మాసాన్ని మాధవ మాసం అని కూడా పిలుస్తారు. ఎందుకంటే వైశాఖమాసం మొత్తం విష్ణువుని పూజిస్తారు. ఈ మాసం అంతా విష్ణువు యొక్క వివిధ రూపాలను పూజిస్తారు. వైశాఖ మాసంలో విష్ణువుని పూజించటం వల్ల ఆ మహావిష్ణువు అనుగ్రహం లభిస్తుంది. అంతేకాకుండా ఈ మాసంలో కొన్ని పనులు చేయటం వల్ల కూడా విష్ణుమూర్తి అనుగ్రహం పొంది ఆనందం, ఐశ్వర్యం సిద్ధిస్తాయి. వైశాఖ మాసంలో చేయవలసిన ఐదు పనుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
• వైశాఖ మాసంలో ప్రతిరోజు శ్రీ మహావిష్ణువుని పూజిస్తూ విష్ణు నామాన్ని జపించడం వల్ల ఆ మహా విష్ణువు అనుగ్రహం లభిస్తుంది.
• అలాగే వైశాఖ మాసంలో అన్నదానం చేయడం చాలా పుణ్యప్రదంగా భావిస్తారు. అయితే ఈ మాసంలో నీరు, మామిడి, బెల్లం, సత్తు, నువ్వులు దానం చేయటం వల్ల విష్ణు మూర్తి అనుగ్రహం లభించటం మాత్రమే కాకుండా పితృ దోషం తొలగిపోతుంది.
• అలాగే వైశాఖ మాసంలో జంతువులు మరియు పక్షులకు ఆహారం అందించటమే కాకుండా పేద ప్రజలకు దాన ధర్మాలు చేయటం వల్ల కూడా పుణ్యం లభిస్తుంది.
Devotional Tips:
• వైశాఖ మాసంలో వచ్చే అక్షయ తృతీయ ఎంతో పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. శుభకార్యాలు చేయడానికి, బంగారు, వెండి, వాహనాలు వంటి వాటిని కొనుగోలు చేయడానికి ఈరోజు ఎంతో మంచిది. వివాహం, నిశ్చితార్థం, బంగారం, వెండి లేదా వాహనం
• అలాగే ఈ మాసంలో కంచు పాత్రలో భోజనం చేయటం చాలా మంచిది. అలాగే ఈ వైశాఖ మాసంలో పగలు నిద్రపోకూడదని పండితులు చెబుతున్నారు.