Devotional Tips: మన హిందూ ధర్మంలో పూజా కార్యక్రమాలకు చాలా ప్రాముఖ్యత ఉంది. దేశవ్యాప్తంగా ప్రజలందరూ ప్రతిరోజు దేవుని పూజిస్తూ ఉంటారు. ముఖ్యంగా శుక్రవారం రోజున ప్రత్యేకమైన పూజలు నిర్వహిస్తూ ఉంటారు. ఎందుకంటే శుక్రవారం లక్ష్మీదేవికి ఇష్టమైన రోజు. ప్రతి ఒక్కరూ లక్ష్మీదేవి అనుగ్రహం తమపై ఉండాలని కోరుకుంటారు అందువల్ల శుక్రవారం రోజున లక్ష్మీదేవికి ప్రత్యేకమైన పూజలు నిర్వహిస్తూ ఉంటారు. ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభించి ఇంట్లో ఆర్థిక సమస్యలు తలెత్తకుండా ఉంటాయి. అయితే శుక్రవారం రోజున మహిళలు పొరపాటున చేసే కొన్ని పనుల వల్ల లక్ష్మీదేవి ఆగ్రహానికి గురై ఆ ఇంటికి దూరం అవుతుంది. అసలు శుక్రవారం రోజు మహిళలు ఎటువంటి పనులు చేయకూడదు ఇప్పుడు తెలుసుకుందాం
శుక్రవారం రోజు లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు. అందువల్ల శుక్రవారం రోజున పూజ గది శుభ్రం చేసుకోవాలి. అయితే పూజగది శుభ్రం చేసిన తర్వాత ఆ చెత్తని బయటపడేయకూడదు. శుక్రవారం రోజున ఏ వస్తువు కూడా ఇంట్లో నుండి బయటకు వెళ్ళరాదు. శుక్రవారం రోజున చెత్త,పాత వస్తువులు బయట పడేయడం వల్ల లక్ష్మీదేవి ఇంటి నుండి వెళ్లిపోతుంది. అంతేకాకుండా శుక్రవారం రోజున ఇంట్లో బూజు దులపరాదు. ఇలా చేయటం వల్ల కూడా లక్ష్మీదేవి ఆగ్రహానికి గురవుతుంది. అయితే శుక్రవారం రోజున ఏవైనా వస్తువులు ఇంట్లోకి కొని తెచ్చుకోవటం మంచిది.
అలాగే శుక్రవారం రోజున పూజ చేయడానికి మహిళలు తలస్నానం చేస్తూ ఉంటారు. శుక్రవారం రోజున తలస్నానం అస్సలు చేయకూడదు. అలా చేస్తే సంపద హరించుకుపోతుంది. శుక్రవారం రోజున తలస్నానం చేస్తే లక్ష్మీదేవికి తలనొప్పి వస్తుంది. అంతే కాకుండా శుక్రవారం రోజున పొరపాటున కూడా కుంకుమ కింద పడకుండా చూసుకోవాలి. కుంకుమ కింద పడితే అరిష్టం. అలాగే ఆ రోజున దేవుడు ముందు పెట్టిన పూలు కూడా వాడిపోకుండా చూసుకోవాలి. అంతే కాకుండా మహిళలు ఇంట్లో ఏడవటం కూడా అరిష్టం. అందువల్ల మహిళలు పొరపాటున కూడా ఈ పనులు చేయరాదు.
Srinidhi Shetty: కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టికి తెలుగులో ఇప్పటి వరకూ సాలీడ్ దక్కలేదు. కన్నడలో ఆమె నటించిన కేజీఎఫ్…
Tollywood: నేచురల్ స్టార్ నాని నటించబోతున్న లేటెస్ట్ మూవీ బ్లడీ రోమియో. సుజీత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రస్తుతం,…
Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…
Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…
Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…
Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…
This website uses cookies.