Devotional Tips: మన హిందూ ధర్మం ప్రకారం ప్రతీ వస్తువుకి ఒక ప్రాధాన్యత ఉంటుంది. అందువల్ల ఆడపిల్లకు పెళ్లి చేసి అత్తవారింటికి పంపించేటప్పుడు చీర ,సారెలు పెట్టడం ఆనవాయితీ వస్తోంది.అయితే ఆడపిల్లకు పెళ్లి చేసి అత్తవారింటికి పంపుతున్నప్పుడు కొన్ని వస్తువులను మన ఇంటి నుంచి వియ్యంకులు వారింటికి అసలు పంపించకూడదు.పొరపాటున ఆ వస్తువులను ఆడపిల్ల అత్తారింటికి పంపడం వల్ల మన ఇంటి నుండి లక్ష్మీదేవి వెళ్లిపోతుంది. అయితే ఏ వస్తువులను పుట్టింటి నుండి ఆడపిల్లలు తీసుకెళ్ళకుడదో ఇప్పుడు తెలుసుకుందాం.
• ఉప్పు : పుట్టింటి నుండి అత్తగారింటికి వెళ్లేటప్పుడు ఆడపిల్లలు పొరపాటున కూడా ఉప్పు వెంట
తీసుకెళ్ళకూడదు. ఎందుకంటే ఉప్పుని లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. లక్ష్మీదేవి స్వరూపంగా భావించే ఉప్పుని ఆడపిల్లలు పుట్టింటి నుండి తీసుకెళ్తే లక్ష్మీదేవి కూడా తమతోపాటు ఇంటి నుండి వెళ్లిపోయి తల్లిదండ్రులకు ఆర్థిక సమస్యలు మొదలవుతాయి.
• చింతపండు :
అలాగే చింతపండు కూడా పుట్టింటి నుండి అత్తగారింటికి తీసుకెళ్లకూడదు. పుట్టింటి నుండి అత్తవారింటికి చింతపండు తీసుకెళ్లటం వల్ల వియ్యాల వారి మధ్య తగాదాలు అవుతాయని పెద్దలు చెబుతూ ఉంటారు.
• చీపురు :
మనం ఇల్లును శుభ్రం చేసుకునే చీపుర్లను లక్ష్మీ దేవిగా భావిస్తూ ఉంటారు.ఈ చీపుర్ల మీద దాటి వెళ్ళటం, లేదా ఇతరులకు దానం చేయకూడదు. ఇలా చేస్తే మనకు వారికి గొడవలు అవుతాయి.అంతేకాక లక్ష్మిదేవిగా భావించే చీపుర్లను ఆడపిల్లకు ఇచ్చి పంపిస్తే మన ఇంట్లో ఆర్థిక సమస్యలు మొదలయ్యే అవకాశం ఉంటుంది.
Devotional Tips:
• పాలు, పెరుగు..
పాలు,పెరుగు పుట్టింటి నుంచి ఆడపిల్ల అస్సలు తీసుకు పోకూడదు. ఇలా చేస్తే వారి ఇంట్లో దరిద్రం అవహించి,వారు వృద్ధిలోకి రారని శాస్త్రాలు చెబుతున్నాయి.
• చింతకాయ పచ్చడి :
చింతకాయ పచ్చడిని కూడా లక్ష్మీ దేవి స్వరూపంగా భావిస్తారు. అందువల్ల ఆడపిల్లలు పుట్టింటి నుంచి చింతకాయ పచ్చడి అత్తవారింటికి తీసుకెళ్ళకూడదు.