Devotional Tips: మన హిందూ సంప్రదాయం ప్రకారం ఇప్పుడు కూడా మనం ఏదైనా శుభకార్యాలకు వెళ్ళిన లేదా కొందరిని కనుక గమనిస్తే భోజనం చేసేటప్పుడు చాలా మంది వారి కంచం చుట్టూ నీటిని వేసుకోవడం మనం చూస్తుంటాము.కంచం చుట్టూ నీటిని వేసుకోవడం చూసాము కానీ ఇలా ఎందుకు వేసుకుంటారు అసలు ఇలా వేసుకోవడానికి గల కారణాలు ఏంటి అనే విషయాల గురించి మాత్రమే ఎప్పుడూ ఆలోచించి ఉండరు. మరి భోజనం చేసే ముందు కంచం చుట్టూ ఇలా నీళ్లు చల్లడానికి గల కారణాలు ఏంటి అనే విషయానికి వస్తే…
భోజనం చేసే ముందు కొంచెం చుట్టూ నీళ్లను చల్లుకోవడం మన పూర్వీకుల కాలం నుంచి ఆచరణలో ఉన్నటువంటి ఒక ఆనవాయితీ అని చెప్పాలి. ఇలా భోజనానికి ముందు నీళ్లు చల్లడానికి కారణం ఏంటంటే పురాతన కాలంలో ఋషులు సాధారణ ప్రజలు కూడా నేలపై కూర్చుని భోజనం చేసేవారు అప్పట్లో కరెంటు కూడా ఉండేది కాదు అలాగే నేలపై భోజనం చేయటం వల్ల ఎన్నో రకాల క్రిమి కీటకాలు మనం తినే ఆహారంలోకి వస్తుంటాయి. అందుకే ఆ క్రిమి కీటకాలను నిలపడం కోసం చుట్టూ నీళ్లు చల్లడం వల్ల అవి ఆ తేమను దాటి మనం తినే ఆహారంలోకి రావు అంతేకాకుండా నేలపై కూర్చొని భోజనం చేయడం వల్ల గాలికి దుమ్ము మన ఆహార పదార్థాలలో పడకుండా ఉండడం కోసం నీటిని చల్లేవారు.
Devotional Tips:
ఇలా భోజనం చేసే సమయంలో నీటిని చల్లడం వల్ల మనం తినే ఆహార పదార్థాలపై దుమ్ము ధూళి క్రిమి కీటకాలు రాకుండా నివారిస్తూ ఉండటం కోసమే ఇలా నీటిని చల్లేవారు అయితే ఇప్పటికి కొంతమంది ఇదే పద్ధతిని అనుసరిస్తూ ఉన్నారు. ఇక ప్రస్తుత కాలంలో నేలపై కూర్చొని భోజనం చేసే వారి సంఖ్య చాలా వరకు తగ్గిపోయిందని చెప్పాలి. ప్రతి ఒక్కరు డైనింగ్ టేబుల్ లేదా కూర్చున్న పైన మంచం పైన కూర్చుని భోజనం చేస్తున్నారు. అయితే ఇలా చేయడం ఏమాత్రం మంచిది కాదని పండితులు చెబుతున్నారు. ఇలా చేయటం వల్ల అన్నపూర్ణ దేవి ఆగ్రహానికి కూడా గురి కావాల్సి ఉంటుంది.