Devotional Tips: మన హిందూ సాంప్రదాయాల ప్రకారం ప్రతి ఒక్కరూ గుడికి వెళ్లి స్వామి వారిని దర్శనం చేసుకున్న తర్వాత అనంతరం తీర్థ ప్రసాదాలను తీసుకుంటాము. అయితే ఇలా స్వామివారి తీర్థప్రసాదాలను తీసుకునే సమయంలో ఒక్కొక్కరు ఒక్కో విధంగా తీసుకుంటూ ఉంటారు. కానీ ఇలా తీర్థ ప్రసాదాలు తీసుకునే సమయంలో కూడా కొన్ని నియమాలు పాటించాలని పండితులు చెబుతున్నారు. ఎలాంటి నియమాలు పాటించాలి అనే విషయానికి వస్తే…
ఆలయంలోకి వెళ్లిన తర్వాత స్వామివారి తీర్థ ప్రసాదాలు తీసుకునే సమయంలో చాలామంది కుడిచేతిని మాత్రమే తీర్థం తీసుకోవడానికి ఉపయోగిస్తారు కానీ అలా ఎప్పుడూ చేయకూడదు ఎడమ చేతి పైన కుడి చేయిని పట్టుకొని తీర్థం తీసుకోవాలి. అలాగే తీర్థం తీసుకున్న తర్వాత చాలా మంది ఆ చేతిని తలకు రాసుకుంటారు. ఇలా ఎప్పుడు కూడా చేయకూడదు. తీర్థం తీసుకున్న తర్వాత రెండు చేతులను రుద్దుకోవాలి. అలాగే మహిళలకు స్వామివారి తీర్థప్రసాదాలను కూడా అందజేస్తుంటారు స్వామి వారి దగ్గర పెట్టిన పుష్పం ఫలం అందజేస్తూ ఉంటారు.’
Devotional Tips:
ఇలా స్వామివారి వద్ద నుంచి పుష్పాన్ని లేదా ఫలాన్ని తీసుకునే సమయంలో మహిళలు ఎప్పుడూ కూడా వారి కొంగు పట్టుకొని కొంగులోకి వాటిని తీసుకోవాలి. ఇక చాలామంది కుడి చేతితో ప్రసాదం తీసుకొని అలాగే తింటూ ఉంటారు అలా ఎప్పుడు చేయకూడదు.కుడి చేతిలోకి ప్రసాదం తీసుకున్న తర్వాత దానిని ఎడమ చేతిలో పెట్టుకొని కుడి చేతితో కొద్దికొద్దిగా తినాలి తీర్థ ప్రసాదాలను తీసుకునే సమయంలో ఇలాంటి నియమాలను పాటించడం ఎంతో ముఖ్యం.