Wed. Feb 11th, 2026

    Devotional Tips: సాధారణంగా మన హిందూ సంప్రదాయాల ప్రకారం మనం ఎన్నో రకాల పద్ధతులను ఆచార వ్యవహారాలను పాటిస్తూ ఉంటాము. మనం చేసే ఏ పని అయినా కూడా సంప్రదాయపద్ధంగా చేయాలని పెద్దలు చెబుతూ ఉంటారు. అయితే చాలామంది ప్రస్తుత కాలంలో ఈ పద్ధతులను ఆచార వ్యవహారాలను పాటించేవారు లేరని చెప్పాలి. ముఖ్యంగా భోజనం చేసే సమయంలో మనం కొన్ని రకాల పద్ధతులను పాటిస్తూ భోజనం చేయడం వల్ల అన్నపూర్ణాదేవి అనుగ్రహం మనపై ఉంటుందని పెద్దలు చెబుతుంటారు.అలాగే అన్నం తిన్న తర్వాత కూడా పొరపాటున కూడా కొన్ని తప్పులు చేయకూడదు అలా చేయడం వల్ల అమ్మవారి ఆగ్రహానికి బలి కావాల్సి ఉంటుంది.

     

    ప్రతి ఒక్కరు భోజనం చేసే సమయంలో నేలపై కాకుండా పైన కూర్చుని భోజనం చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల అన్నపూర్ణ దేవిని అవమానించినట్లేనని పెద్దలు చెబుతుంటారు అందుకే నేలపై కూర్చుని తూర్పు వైపుకు తిరిగి భోజనం చేయడం ఎంతో మంచిది. ఇకపోతే భోజనం చేసిన తర్వాత చాలామంది మనం తిన్న కంచంలోనే చేతులు కడుగుతూ ఉంటారు. ఇలా తిన్న ప్లేట్లోనే చేతులు కడగటం వల్ల అన్నపూర్ణ దేవిని అవమానించినట్లేనని పెద్దలు చెబుతున్నారు.

    Devotional Tips:

    భోజనం చేసిన వెంటనే మనం తిన్న ఎంగిలి చేతిని కంచంలో కాకుండా బయటకు వెళ్లి కడుక్కోవడం ఎంతో మంచిది అలాగే తిన్న ప్లేటును అలాగే వేయకుండా వెంటనే శుభ్రం చేయటం వల్ల అన్నపూర్ణాదేవి సంతోషిస్తుంది. అయితే చాలామంది తిన్న తర్వాత అదే ప్లేట్ లోనే చేతులు కడుగుతూ ఉంటారు. ఇలా చేయడం వల్ల గ్రహాల వ్యతిరేక ప్రభావం వారిపై ఉంటుంది అందుకే జీవితంలో కూడా ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందుకే భోజనం చేసిన తర్వాత చేతులు బయట కడుక్కోవడం ఎంతో మంచిదనీ పండితులు చెబుతున్నారు.